మంటల్లో కాలుతూ అర్ధరాత్రి యువతి హాహాకారాలు ..యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిందెవరు ?
అర్దరాత్రి సమయంలో ఓ యువతి హాహాకారాలు విశాఖ నగరంలోని శివాజీపాలెం వాసులను ఆందోళనకు గురి చేశారు. వొళ్ళంతా కాలుతూ మంటలతో రోడ్ మీదకు పరుగెత్తుకొచ్చిన ఆ యువతిని గుర్తించి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు స్థానికులు . 60 శాతం గాయాలతో ఉన్న ఆ యువతి ప్రస్తుతం విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

మంటల్లో కాలుతూ రోడ్ పైకి పరుగెత్తుకొచ్చిన కావ్య అనే యువతి .. ఆస్పత్రికి చేర్చిన స్థానికులు
వెంకోజీపాలెంలోని రామాయలం వీధిలో నివాసముంటున్న 25 సంవత్సరాల వయసు గల కావ్య అనే యువతి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని కారణంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి రామాయలం వీధిలో నివాసం ఉంటున్నారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారని స్థానికులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి మంటలతో కాలిపోతూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ వచ్చి శివాజీపాలెం రోడ్డులో ఒక్కసారిగా పడిపోయింది. మంటల్లో కాలుతున్న కావ్యను గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేసి ఆమెను స్థానిక కేజీహెచ్‌కు తరలించారు. బాధితురాలిని శ్రీకాకుళంలోని బత్తిలి గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు.

దుండగుల దాడినా లేకా అత్మహత్యాయత్నామా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు
ఇక ఈ నేపధ్యంలో ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడారు. ఇక కావ్య ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె రహదారి పక్కనే వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని ఏం జరిగిందో ఆమెకు అర్ధం కాలేదని , కాలుతున్న గాయాలతో పరుగులు తీశానని ఆమె చెప్పింది. తనపై ఎవరైనా దుండగులు దాడి చేశారా అన్న ప్రశ్నకు ఆమె నుండి సమాధానం లేదు. తనకేం అర్ధం కాలేది మాత్రం చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అసలు యువతిపై ఎవరైనా దుండగులు దాడి చేశారా ? లేకా ఆమెనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందా? అసలు ఏం జరిగింది అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు.

60 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కావ్య..
ఇక కావ్య 60 శాతం గాయాల పాలు అయ్యింది అంటే కచ్చితంగా ఆమెపైన ఎవరో పెట్రోల్ పోసి దాడికి అయినా పాల్పడి ఉండాలి. లేదా ఆమెనే ఆత్మ హత్యా యత్నానికి పాలప్ది అయినా ఉండాలి. కానీ కావ్య ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని ఏం జరిగిందో తనకు తెలీదని చెప్తుంది. ప్రస్తుతం ఆమె 60 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా పోలీసులు ఈ కేసులో బయట ఏం జరిగింది అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కావ్య పని చేసే హాస్పటల్ లో కూడా ఆమె గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెకు శత్రువులు కానీ , ఆమెకు ప్రేమికులు కానీ ఎవరైనా ఉన్నారా అన్న క్రమంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications