విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆ విషయంపై మాట్లాడాను: స్పీకర్ తమ్మినేని సీతారాం..!!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కళింగ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని ఒకరి పాదాల వద్ద తాకట్టు పెట్టే వారి తాట తీస్తామని హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్రం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. కళింగ సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన అన్నారు. పదవుల కోసం ఆరాటపడుతూ ఒక సామాజిక వర్గం పౌరుషాన్ని తక్కువ చేసి, వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నించే వారి తాట తీస్తామని హెచ్చరించారు.

లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!

కళింగుల ఆత్మీయ సదస్సులో..

కళింగుల ఆత్మీయ సదస్సులో..

అన్ని రంగాల్లోనూ కళింగులకు సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని, రాజకీయాలు దీనికి మినహాయింపేమీ కాదని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తాము సమాజంలో గౌరవంగా జీవిద్దామని, పదవులు లేకపోతే చచ్చిపోతామా? అని ప్రశ్నించారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కళింగ సామాజిక వర్గం ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నాలుగుసార్లు ఓడిపోయా..

నాలుగుసార్లు ఓడిపోయా..

వేర్వేరు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఆముదాలవలస నియోజకవర్గం నుంచి పోటీచేసి, నాలుగుసార్లు ఓడిపోయానని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. అయినప్పటికీ- ఎక్కడే గానీ, ఎవ్వరికీ గానీ తలవంచలేదని అన్నారు. పైడి శ్రీరామమూర్తి, కూన రవికుమార్, బొడ్డేపల్లి సత్యవతి చేతుల్లో తాను పరాజయం పాలయ్యానని చెప్పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించిన వాడే రాజకీయ నాయకుడవుతాడని అన్నారు.

వారికే టికెట్లు..

వారికే టికెట్లు..

ఓటమిని సమానంగా తీసుకోవడం కూడా రాజకీయ నాయకుడి అర్హతేనని అన్నారు. కళింగ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో వారికే టికెట్లు దక్కాల్సిన అవసరం ఉందని తమ్మినేని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఏ పార్టీ న్యాయం చేస్తుందో.. ఆ పార్టీ వైపే అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన వారు తాము వేసే ప్రతి అడుగును కూడా ఆచితూచి వేయాల్సిన సందిగ్ధత ఏర్పడిందని అన్నారు.

కళింగులకు ప్రాధాన్యత..

కళింగులకు ప్రాధాన్యత..

ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో ఉన్న కళింగులు రాజకీయాధికారం కోసం పోరాడక తప్పదనీ తమ్మినేని పేర్కొన్నారు. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కళింగులకు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇది కార్యరూపం దాల్చుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు.

 కేసీఆర్‌తో మాట్లాడా..

కేసీఆర్‌తో మాట్లాడా..

తెలంగాణలో కళింగ సామాజికవర్గానికి టికెట్ల కేటాయింపులో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గాల్లో రిజర్వేషన్లను కల్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. కళింగులను తెలంగాణ ప్రభుత్వం బీసీ-ఏ కేటగిరీ నుంచి తొలగించిందని తమ్మినేని సీతారాం చెప్పారు. ఈ అంశంపై తాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో మాట్లాడానని తెలిపారు.

రిజర్వేషన్ల కోసం..

రిజర్వేషన్ల కోసం..

కళింగులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడానికి, వారికి దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేయడానికీ తాము వెనకాడోమని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- కళింగ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తోన్నారని, వచ్చే ఎన్నికల్లో ఇది మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కళింగులకు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే టికెట్లను వైఎస్ జగన్ ఇచ్చారని చెప్పారు.

English summary
AP assembly speaker Tammineni Seetharam made key comments in Kalinga meeting at Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X