టీడీపీకి బొబ్బిలి రాజుల గుడ్ బై..! భవిష్యత్ పై హామీ కోసం..నిరీక్షణ : గ్రీన్ సిగ్నల్ రాగానే..!
రాజుల ఖిల్లా విజయనగరం జిల్లాలో టీడీపీని వీడేందుకు మరో కుటుంబం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో టీడీపీకి తొలి నుండి ఆశోక్ గజపతి రాజు కుటుంబం అండగా ఉంది. అక్కడే మరో రాజుల కుటుంబం అయిన సుజయ కుటుంబంతో వీరికి గ్యాప్ ఉంది. 2014లో వైసీపీ నుండి సుజయ సోదరులు వైసీపీ నుండి పోటీ చేసారు. సుజయ రంగారావు వైసీసీ నుండి బొబ్బిలి గెలవగా..ఎంపీగా పోటీచేసిన బీబీ నయన ఓడిపోయారు. ఇక, ఆ తరువాత సోదరులిద్దరూ టీడీపీలో చేరారు. అయినా..అక్కడ అశోక్ కుటుంబంతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు కుటుంబాలు టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాయి. అప్పటి నుండి అశోక్ గజపతి కుటుంబం ప్రత్యేక కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు సుజయ సోదరులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే పార్టీ మారటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఇక వీడినట్లేనా..
విజయనగరం జిల్లాలో రాజకీయంగా పేరున్న కుటుంబం. సుజయ కృష్ణ రంగారావు మూడు సార్లు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ పార్టీ స్థాపించిన తరువాత విశ్వాస పరీక్షలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హతకు గురయ్యారు. 2014లో వైసీపీ నుండి బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలో సోదరుడు బేబి నాయనతో సహా కలిసి చేరారు. ఆ తరువాత పలుమార్లు జగన్ పైన తీవ్ర విమర్శలు చేసారు. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో సుజయ కృష్ణ రంగారావు టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. జిల్లాలోని ఎంపీ సీటుతో సహా మొత్తం 9 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకొని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో..టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజు సైతం ఓడిపోయి..ప్రస్తుతం పార్టీకి ప్రత్యేక కారణాల వలన దూరంగా ఉంటున్నారు. జిల్లాలో పార్టీలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇప్పుడు ఈ సుజయ సోదరులిద్దరూ సైతం పార్టీ వీడే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

బీజేపీ నుండి ఆహ్వానం..
సుజయ సోదరులకు బీజేపీ నుండి ఆహ్వానం వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో సుజయ కృష్ణ రంగారావు ఎన్ని సార్లు అడిగినా సుముఖత వ్యక్తం చేయకపోవటంతో..ఆయన సోదరుడు రాజా వెంకట శ్వేతాచలపతి కుమార కృష్ణ రంగారావు ఎలియాస్ బేబి నాయన ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలు మార్లు ఈ అంశం పైన వారితోనే చర్చించినట్లు సమాచారం. 2014లో వైసీపీ నుండి గెలిచి..టీడీపీలో చేరి..2019లో టీడీపీ నుండి పోటీ చేసి..ఇప్పుడు బీజేపీలో చేరితో జిల్లాలో ప్రధానంగా తమ నియోజకవర్గంలో పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుందనే ఆందోళన వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉండటంతో వారి రాజకీయ భవిష్యత్ కు స్పష్టమైన హామీ ఇస్తే టీడీపీ వీడి బీజేపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నట్లుగా వారు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ స్పష్టత ఇవ్వటం కోసం బీజేపీ రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది క్లారిటీ రాగానే.. ముఖ్య అనుచరులతో సమావేశమై సోదరులిద్దరూ టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications