ఫ్యామిలీ మెంబర్సే హత్య చేశారు.. తల్లి, అక్క, అల్లుల్లే కడతేర్చారు.. ఇదీ శ్యామ్ కథ..
విశాఖపట్నం మహరాణి పేటకు చెందిన శ్యామ్ హత్యకేసు మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన తల్లి, అక్క, బావలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాణిపేట, తాడి వీధికి చెందిన టేకుమూడి శ్యామ్ ఆదివారం అనుమానాస్పద స్ధితిలో చనిపోయాడు. స్ధానిక కార్పోరేటర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుటుంబసభ్యులే...
శ్యామ్‌ను కుటుంబ సభ్యులే హత్యచేసినట్లు అనుమానించి వారిని అదుపులోకి తీసుకుని విచారించే సరికి నిజాలు బయటపడ్డాయి. శ్యామ్ సోదరి లక్ష్మిదుర్గ అలియాస్ ఫాతిమాకు ఆరోగ్యం బాగోక పోవటంతో వారం రోజుల క్రితం తల్లి సుగుణ దగ్గరకు వచ్చింది. సుగుణ కొడుకు శ్యామ్ కుమార్ ముడేళ్లుగా బైక్ కొనమని వేధిస్తుండటంతో...నాలుగు నెలల క్రితం ఫైనాన్స్ మీద బైక్ కొని ఇచ్చింది.

మద్యం సేవించి.. వేధించి
వ్యసనాలకు అలవాటు పడిన శ్యామ్ నెల రోజుల క్రితం బైక్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని జల్సా చేశాడు. ఆ బైక్ ను విడిపించి ఇవ్వమని తల్లితో రోజూ గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి తాగి వచ్చి తల్లి సుగుణను, సోదరి ఫాతిమాను బైక్ విషయమై విపరీతంగా వేధించాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన సుగుణ కొడుకును అంతం చేయాలనుకుని ముందే నిర్ణయించుకుంది.

ముందుగా ప్రణాళిక
ఆదివారం రాత్రి శ్యామ్ ఇంట్లో వాళ్లను వేధించేసరికి... అప్పటికి ముందుగానే ప్లాన్ చేసుకున్న సుగుణ తన పెద్దల్లుడు ఫాతిమా భర్త షేక్ పీర్ సాహెబ్, చిన్నల్లుడు ఉప్పరపల్లి అంకిత్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. శ్యామ్ నిద్రపోయిన తర్వాత అల్లుళ్లు ఇద్దరూ ఒకరు....శ్యామ్ కాళ్లమీద కూర్చోగా, మరోకరు చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. కూతురు ఫాతిమా, శ్యామ్ ముఖంపై దిండు గట్టిగా అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసింది. తల్లి సుగుణ ట్రాక్ నాడాను తీసుకుని శ్యామ్ మెడ చుట్టూ బిగించటంతో శ్యామ్ ఊపిరాడక చనిపోయాడు.
Recommended Video

కార్పొరేటర్ ఫిర్యాదుతో..
శ్యామ్ అనుమానాస్పద మృతిపై 30వ డివిజన్ కార్పిరేటర్ అప్పల కొండ మహరాణి పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications