విశాఖ ఉక్కు కోసం ఎంపీలు , ఎమ్మెల్యేల రాజీనామాల డిమాండ్, బీజేపీ, పవన్ స్పందించాలి : గంటా శ్రీనివాస్
విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మరోమారు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పై కేంద్రం వైఖరి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
ఉధృతమైన
విశాఖ
ఉక్కు
ఉద్యమం
:
తెలంగాణా
మావోయిస్టుల
మద్దతు
,
ఉక్కు
పరిపాలనా
భవనం
ముట్టడి

అందరం కలిసి పోరాటం చెయ్యాల్సిన సమయం అన్న గంటా శ్రీనివాస్
కేంద్ర వైఖరిని గతంలోనే ప్రధాని స్వయంగా చెప్పారు, కానీ రాష్ట్రంలోని పెద్దలు ఏం జరగలేదని తప్పుదోవ పట్టించారు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు సంబంధించి రాష్ట్రానికి సమాచారం అందిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని ప్రైవేటీకరణ పై ఆర్థిక మంత్రి ప్రైవేటీకరణ ముగిసిపోయిన అధ్యాయం అన్నారని పేర్కొన్నారు.
ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడానికి అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేసిన గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు కోసం సిఎం తో కలిసి పని చేస్తామని చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలి
కేంద్ర
ప్రభుత్వం
నిర్ణయం
ఉపసంహరించుకోవడానికి
ఎంపీలు,
ఎమ్మెల్యేలు
అందరూ
రాజీనామాలు
చేసి
విశాఖ
ఉక్కు
ఉద్యమాన్ని
మరింత
ఉదృతంగా
సాగించాలని
గంటా
శ్రీనివాస్
రావు
పిలుపునిచ్చారు.
రాజీనామాలు
చేసిన
చోట
టిడిపి
పోటీ
పెట్టదని
గంటా
శ్రీనివాస్
స్పష్టం
చేశారు
.
తాజా
పరిణామాల
తీవ్రత
నేపథ్యంలో
వెంటనే
కార్యాచరణ
ప్రణాళిక
ప్రకటించాలని
సీఎంను
కోరుతున్నానని
గంటా
శ్రీనివాస్
పేర్కొన్నారు.
ఇక
కేంద్ర
ప్రభుత్వం
నిర్ణయం
ఉపసంహరించుకునే
దాక
బీజేపీ
నేతలు
ప్రధాన
పాత్ర
పోషించాలని
గంటా
అన్నారు.

జనసేన అధినేత పవన్ పోరాటం చెయ్యాలి , ఉక్కు ఉద్యమంపై స్పందించాలి
సీఎం
జగన్మోహన్
రెడ్డి
ప్రధాని
నరేంద్ర
మోడీని
కలిసినప్పుడు
విశాఖ
ఉక్కు
ఫ్యాక్టరీ
గురించి
ఎందుకు
ప్రస్తావించలేదో
చెప్పాలన్నారు
గంటా
శ్రీనివాస్.
ఢిల్లీలో
పాదయాత్రకు
తామంతా
సిద్ధంగా
ఉన్నామని
అన్న
గంటా
శ్రీనివాస్
అందరూ
కలిసి
రావాలంటూ
పిలుపునిచ్చారు.
ఇదే
సమయంలో
జనసేన
అధినేత
పవన్
కళ్యాణ్
విశాఖ
ఉక్కు
ఉద్యమం
పై
స్పందించాలన్నారు
.కార్మికుల
తరఫున
పవన్
పోరాటం
చేయాలని
విజ్ఞప్తి
చేశారు
.
రాష్ట్ర
మంత్రులు
రాజీనామా
చేస్తే
కచ్చితంగా
ఫలితం
ఉంటుందని,
రాజకీయ
పార్టీలన్నీ
ఒకే
మాటపై
నిలబడాల్సిన
అవసరం
ఉందని
గంటా
శ్రీనివాస్
స్పష్టం
చేశారు.

ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి
ప్రస్తుత
అనివార్య
పరిస్థితుల
నేపథ్యంలో
విశాఖ
స్టీల్
ప్లాంట్
కాపాడుకోవడం
కోసం
భేషజాలను
పక్కనపెట్టి
అన్ని
పార్టీల
ప్రజా
ప్రతినిధులు
కలిసి
రావాలని
గంటా
శ్రీనివాస్
పిలుపునిచ్చారు.
కేంద్రం
తన
స్పష్టమైన
వైఖరిని
తెలియజేసిందని
,
ఇక
జగన్
సర్కార్
కార్యాచరణ
ప్రకటించాల్సి
ఉందని
గంటా
శ్రీనివాస్
పేర్కొన్నారు
.
ఎలాగైనా
విశాఖ
స్టీల్
ప్లాంట్
ను
కాపాడుకోవాలని
ఆయన
అన్ని
పార్టీలకు
విజ్ఞప్తి
చేశారు
.
విశాఖ
స్టీల్
ప్లాంట్
ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా
గంటా
శ్రీనివాస్
ఎమ్మెల్యేగా
రాజీనామా
చేసిన
విషయం
తెలిసిందే
.