విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ప్రభుత్వంలో అక్రమాలు.. తనకు పిలుపే రాలే, దాడి వీరభద్రరావు హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ప్రతీ లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలను కూడా నియమించారు. దీనిపై విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. స్వపక్షం నుంచి కౌంటర్ అటాక్ రావడం కాస్త ఇబ్బందికి గురిచేస్తోంది. వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇదీ చర్చకు దారితీసింది.

దాడి మనస్తాపం..

దాడి మనస్తాపం..

కొత్త జిల్లాల ఏర్పాటుపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావును మనస్తాపానికి గురి చేసిందట. దీంతో ఆయన జగన్ పాలనపై ఆరోపణలు చేశారు. జిల్లాల ఏర్పాటులో తనకు ఆహ్వానం అందలేదని మనస్తాపం చెందారు. జిల్లాల ఏర్పాటులో తనకు కనీసం సమాచారం లేదన్నారు. పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి పిలుపు లేదని దాడి వీరభద్రరావు వాపోయారు. టీవీలో సీఎం జగన్ మొహం చూసి ప్రసంగం విని ఆనందించానని చెప్పుకొచ్చారు.

ప్రధాన కార్యదర్శిని గౌరవించలే.. అయినా..

ప్రధాన కార్యదర్శిని గౌరవించలే.. అయినా..


పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు ఆహ్వానం కూడా రాలేదని దాడి వీరభద్రరావు ఆవేదన చెందారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రాతినిధ్యం కూడా లేదని వాపోయారు. తమను ఎవరు కాలు పెట్టి తోసేసినా పార్టీని గౌరవిస్తా అని చెప్పారు. ఎన్ని అవమానాలు ఎదురైనా జగన్ ఆశయాల కోసం పని చేస్తానని వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని కామెంట్ చేశారు. పోలీసులు, కబ్జాదారులు, తహశీల్దార్లు కుమ్మక్కైపోయారు. జగన్ ఇదంతా చెక్ చేసుకోవాలని దాడి వీరభద్రరావు సూచించారు.

 సంతోషమే.. కానీ

సంతోషమే.. కానీ


అనకాపల్లి జిల్లా ఏర్పడిననందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీ పదవుల్లో ఉన్నవారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఆన్ లైన్ విధానంతో రెవెన్యూ అస్తవ్యస్తమైందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల రికార్డులు మార్చేశారని, రెవెన్యూ అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసి లే ఔట్లుగా అమ్మేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రత్యేక విభాగంతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
ysrcp secretary dhadi veerabhadra rao made sensational comments. illegal work done in ys jagan government he alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X