నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్

విశాఖలో భూ కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. భూ ఆక్రమణల ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భూ అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ,సొంత పార్టీ నేతలే అయినా సరే క్షమించేది లేదని జగన్ చెప్పారని విజయ సాయి రెడ్డి తెలిపారు.

విశాఖలో నా పేరు చెప్పి భూములు సెటిల్మెంట్లు చేస్తూ ఎవరైనా సరే వదలను అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. భూ ఆక్రమణలు వ్యవహారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సొంత పార్టీ నాయకులు ఎవరు ఉన్నా సరే క్షమించేది లేదని స్పష్టం చేశారు. తన పేరు ఉపయోగించి సెటిల్మెంట్లు చేసే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తానని విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు ఇలా ఏ ఇతర భూముల జోలికి వచ్చినా వదిలేది లేదన్నారు. ప్రశాంత విశాఖనగరం తమ లక్ష్యమని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

 MP Vijayasai warn .. never leave anybody using my name in land grabbings

విజయసాయి రెడ్డి పేరు చెప్పి విశాఖకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి భూదందాలు చేస్తున్నారని దీంతో కొయ్య ప్రసాద్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా చర్యలలో భాగంగా ప్రసాద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో తాజాగా మరోమారు విజయసాయిరెడ్డి విశాఖలో భూ దందాపై మాట్లాడారు. తన పేరు చెప్పి భూ దందాలు చేస్తే క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+