Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ యువతుల మిస్సింగ్ కేసు సుఖాంతం: బెంగళూరులో తేలిన అక్కాచెల్లెళ్లు..

మూడురోజుల క్రితం విశాఖపట్టణంలో కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్ల ఆచూకీ దొరికింది. విశాఖలో మాయమై.. బెంగళూరులో తేలారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లి.. అటు నుంచి బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మొబైల్ లోకేషన్ ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి వైజాగ్ తీసుకొస్తున్నారు.

ఈ నెల 18వ తేదీన కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లు తమ గురించి వెతకొద్దని తల్లికి మేసెజ్ చేశారు. దీంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. వెంటనే ద్వారకా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి.. అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు మొబైల్ లోకేషన్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పేరెంట్స్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారు ఎందుకు పారిపోయారనే అంశంపై క్లారిటీ లేదు. ఈ అంశంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.

same family three girls are safe in bangalore..

అక్కాచెల్లెళ్లు ఎందుకు వెళ్లిపోయారే తెలియకున్నా.. వారు క్షేమంగా ఉన్నారని తెలిసి పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య మనసు కాస్త స్థిమిత పడిందని చెప్తున్నారు. తమ కూతుళ్ల ఆచూకీ కనుకొని అప్పగిస్తోన్న పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారు చేసిన మేలును జన్మలో కూడా మరచిపోలేదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+