విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో తండ్రికి షాక్.. కేసు నమోదు!!

|
Google Oneindia TeluguNews

ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియ కేసులో వైజాగ్ పోలీసులు మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటికే సాయి ప్రియ పై, ఆమె ప్రియుడు రవితేజ పై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అధికారుల సమయాన్ని వృధా చేశారని పోలీసులు కోర్టు అనుమతితో కేసు నమోదు చేయగా, తాజాగా సాయి ప్రియ తండ్రి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

సాయిప్రియ తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు

సాయిప్రియ తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు


గత నెల 25న భర్తను విడిచి వెళ్లిన సాయిప్రియ కేసులో సాయిప్రియ తండ్రి రాపిరెడ్డి అప్పలరాజుపై విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 25న సాయిప్రియ తన భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.ఆ రోజు తన భర్త రిలాక్స్‌గా ఉన్న సమయంలో సాయిప్రియ ముందుగా ప్లాన్ చేసుకుని ప్రియుడు రవితేజతో కలిసి పారిపోయింది. తన కూతురు బీచ్‌లో కనిపించకుండా పోయిందని సాయిప్రియ తండ్రి రాపిరెడ్డి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా చెప్పని తండ్రి.. అందుకే కేసు నమోదు

కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా చెప్పని తండ్రి.. అందుకే కేసు నమోదు

సాయిప్రియ కనిపించలేదన్న ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన జిల్లా అధికారులు, పోలీసులు బీచ్‌లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఇందుకోసం భారీగా ప్రభుత్వ వనరులను వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే సాయిప్రియ తండ్రికి తన కూతురు రవితేజ అనే యువకుడిని ప్రేమిస్తోందని గతంలోనే తెలిసినా, ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని తప్పుదారి పట్టించారని కేసు

ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని తప్పుదారి పట్టించారని కేసు

సాయి ప్రియ ప్రియుడి వ్యవహారం తండ్రికి ముందే తెలిసినప్పటికీ పోలీసులకు చెప్పకపోవడంతో పోలీసులను, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రామారావు వెల్లడించారు.కోర్టు అనుమతితో 182ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక సాయి ప్రియ భర్త శ్రీనివాస్ కూడా తన భార్య సాయి ప్రియ ప్రేమ వ్యవహారం తండ్రికి ముందే తెలుసని, కానీ చెప్పకుండా మోసం చేశారంటూ తండ్రి పైన కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సాయి ప్రియ తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఇప్పటికే కోర్టు అనుమతితో సాయిప్రియ, రవితేజలపై ఐపీసీ సెక్షన్‌ 429, 417, 494, 202 ఆర్‌/డబ్ల్యూ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Another twist has taken place in the case of Saipriya who disappeared in RK Beach. Visakha police have registered a case against Saipriya's father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X