గంటా వైపు అన్ని పార్టీల చూపు- విశాఖ కేంద్రంగా కాపు రాజకీయం
విశాఖపట్నం: తెలుగదేశం విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన కాపు ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి ఒకవంక టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యూహాలను పన్నుతోండగా- దాన్ని చిత్తు చేసేలా వ్యవహరిస్తోన్నారు గంటా శ్రీనివాస్. ఈ విషయంలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోన్నారు.

బుజ్జగింపులు..
మొన్నటికి మొన్న గంటా శ్రీనివాస్ పార్టీని వీడబోతోన్నారంటూ వచ్చిన వార్తలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర అయోమయానికి, గందరగోళానికి దారి తీశాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఈ విశాఖ నార్త్ ఎమ్మెల్యే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారంటూ వచ్చిన వార్తలు చంద్రబాబును సైతం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరికి తానే స్వయంగా రంగంలోకి దిగి- ఆయనను బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చిందప్పట్లో.

వంగవీటి రంగా వర్ధంతి నాడు..
వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగనుంది. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఈ సభ ఏర్పాటు కానుంది. గంటా శ్రీనివాస్ దీనికి నాయకత్వం వహించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని ఎలా పొందాలనే విషయం మీద ఈ సభలో చర్చించనున్నారు. దీనిపై ఓ తీర్మానాన్ని ఆమోదించనున్నారు.

ఏకతాటిపైకి..
ఈ నేపథ్యంలో- కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు మొత్తాన్నీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి గంటా శ్రీనివాస రావు తన ప్రయత్నాలు మొదలు పెట్టారనేది ఇక్కడ స్పష్టమౌతోంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నాయకులు హాజరవుతారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఊపందుకుంది. భిన్నాభిప్రాయాలు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులందరూ ఏకతాటిపైకి వస్తారా? కాపు నాడు సభ సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.

ప్రత్యామ్నాయాలేంటీ?
కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంటా శ్రీనివాస్- టీడీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోన్నారనేది బహిరంగ రహస్యం. ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ- దీన్ని ఆయనే స్వయంగా తోసిపుచ్చారు. ఆయన ముందున్న ప్రత్యామ్నాయాల్లో ఒకటి టీడీపీలో కొనసాగడం, లేదా బీజేపీ/జనసేనల్లో ఏదో ఒక పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడం. గంటా శ్రీనివాస్ ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీకి మెజారిటీ కాపు సామాజిక వర్గ ఓటర్లు జై కొడతారనే అంచనాలు ఉన్నాయి.

రాజకీయ లబ్ది కోసం..
ఇదిలావుండగా- కాపునాడు సభను నిర్వహించనున్న గంటా శ్రీనివాస్‌పై విమర్శల దాడి కూడా లేకపోలేదు. తన రాజకీయ లబ్ది కోసం, తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవడానికి గంటా- తన సొంత సామాజిక వర్గ ఓటు బ్యాంకును పణంగా పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తోన్నాయి. మూడు పార్టీలతో గంటా శ్రీనివాస్ మూడు ముక్కలాట ఆడుతున్నారంటూ ఇప్పటికే విశాఖపట్నం జిల్లా కాపు నాడు నాయకులు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ గంటా శ్రీనివాస్ మీదే నిలిచింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications