Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌కు దండం పెట్టిన ఆర్ నారాయణ మూర్తి..!!

అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని జోగినాథుని పాలెంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఘాటు విమర్శలు సంధించారు.

ఆర్ నారాయణ మూర్తి ప్రత్యక్షం..

ఆర్ నారాయణ మూర్తి ప్రత్యక్షం..

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఈ సభలో ప్రత్యక్షం అయ్యారు. వైఎస్ జగన్ అంటే ఎంతగానో అభిమానించే ఆయన ఓ బహిరంగ సభలో ఆయనతో కలిసి పాల్గొనడం, వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది వరకు ఆయన జగన్ ను కలిసిన సందర్భాలు ఉన్నప్పటికీ- రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

 తాండవ-ఏలేరు ప్రాజెక్ట్ పట్ల..

తాండవ-ఏలేరు ప్రాజెక్ట్ పట్ల..


తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కింద కాలువల అనుసంధానం పనులకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేయడాన్ని ఆర్ నారాయణ మూర్తి స్వాగతించారు. దీనికోసం ఉత్తరాంధ్ర ప్రజలు కలలు గన్నారని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతాల గుండా ఏలేరు జలాలు పోతున్నప్పటికీ వాటిని వినియోగించుకునే అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.

 పంటలు పండక..

పంటలు పండక..

ఏలేరు నది కళ్లముందే పారుతున్నప్పటికీ- ఆ నది నీటిని వ్యవసాయానికి, మంచినీటి అవసరాలకు మళ్లించే సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేవని ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. ఫలితంగా- లక్షలాది హెక్టార్లల్లో పంటలు పండలేదని, ఉపాధి కోసం రైతులు, రైతు కూలీలు వలస వెళ్లాల్సిన దుస్థితి ఎదురైందని ఆయన అన్నారు.

 దాడిశెట్టితో కలిసి..

దాడిశెట్టితో కలిసి..

ఈ విషయంపై తాను రోడ్లు-భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కలిసి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని ఆర్ నారాయణ మూర్తి గుర్తు చేశారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని, వెంటనే దీనికి అవసరమైన నివేదికలను తెప్పించుకుని- ఇప్పుడు శంకుస్థాపన చేశారని అన్నారు. అందుకే తాండవ-ఏలేరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్ కు సెల్యూట్ చేస్తాననంటూ ఆయన పేర్కొన్నారు.

పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా..

పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా..


అంతకుముందు నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ చేసిన ప్రసంగం కూడా అభిమానులను ఆకట్టుకుంది. జగన్‌ రాకతో నర్సీపట్నానికి సంక్రాంతి పండగ ముందే వచ్చిందని అన్నారు. 500 కోట్ల రూపాయలతో మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, 470 కోట్ల రూపాయలతో తాండవ-ఏలేరుకు నీటి అనుసంధాన కాల్వల నిర్మాణం,16 కోట్ల రూపాయలతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+