కొంగు బిగించి..బాక్సింగ్‌ రింగ్‌లో సివంగిలా దూకిన రోజా- పదునైన పంచ్‌లతో

విశాఖపట్నం: రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోతుంటారు పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్ కే రోజా. పదునైన పంచ్‌లో విరుచుకుపడుతుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరు ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా దాన్ని తిప్పి కొడుతుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం గానీ, జనసేన గానీ, భారతీయ జనతా పార్టీ గానీ చేసే విమర్శలపై ఎదురుదాడికి దిగడంలో ముందు వరసలో ఉంటారామె.

Roja

మొన్నటికి మొన్న మాండోస్ తుఫాన్.. సృష్టించిన పెను తుఫాన్ పరిస్థితుల్లో కూడా రోజా- గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నగరి పరిధిలో ఆమె జోరు తుఫాన్‌లో కూడా విస్తృతంగా పర్యటించారు. రాత్రి వరకూ గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం పరిధిలోని ఇళ్లకు వెళ్లారు. స్థానికులను కలుసుకున్నారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇటీవలే డాన్స్‌తో అదరగొట్టారామె. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గిరిజన కళాకారులతో కలిసి స్టెప్స్ వేశారు. థింసా నృత్యం చేశారు. జానపద గీతానికి సంప్రదాయబద్ధంగా నృత్యం చేశారు. కళాకారులతో కలిసి కాలు కదిపారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తోంది.

Roja

ఇందులో భాగంగా విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్‌లో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ సంబరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం కళాకారులతో కలిసి రోజా చేసిన డ్యాన్స్‌ చేశారు. ఇవ్వాళ తాజాగా బాక్సింగ్ రింగ్‌లో దూకారామె. సరదాగా బాక్సింగ్ ఆడారు. ప్రత్యర్థులపై పంచ్‌లను విసురుతూ సందడి చేశారు. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ అమెచ్యుర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు రోజా. అనంతరం సరదాగా బాక్సింగ్ ఆడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+