సబ్బం హరి ఇంటికెళ్లి నాలుక కోస్తాం - వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ - పొలిటికల్ బ్రోకర్ అంటూ..

విశాఖపట్నంలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చేసిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. తనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తానంటూ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సబ్బం హరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మీడియా ముందే వాడు వీడు అనడం వివాదాస్పదంగా మారింది. సబ్బం వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ తాజాగా ఆయనకు మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇంటికెళ్లి నాలుక కోస్తాం..

ఇంటికెళ్లి నాలుక కోస్తాం..

పార్కు స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా, సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత సబ్బం హరి అవాకులు చెవాకులు పేలుతున్నారని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సబ్బం హరి భాష అభ్యంతరకరంగా ఉందని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే జగన్ సైనికుడిగా సబ్బం హరి ఇంటికి వెళ్లి నాలుక కోస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సబ్బం అక్రమాల చిట్టాను అమర్ నాథ్ రెడ్డి బయటపెట్టారు..

జై సమైక్యాధ్ర పార్టీలోనూ ఇదే తీరు..

జై సమైక్యాధ్ర పార్టీలోనూ ఇదే తీరు..

‘‘నాకు తెలిసి సబ్బం హరి పచ్చి పొలిటికల్ బ్రోకర్. గతంలో జై సమైక్యాంధ్ర పార్టీలో ఆయనేం చేశారో అందరికీ తెలిసిందే. కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ప్రజాప్రతినిధిగా పనిచేసిన సబ్బం ఎన్నెన్ని అక్రమాస్తులు కూడబెట్టారో విశాఖ ప్రజలకు తెలుసు. తాజాగా ఆయన ఆక్రమించిన పబ్లిక్ పార్క్ స్థలం విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. ఇంటి వ్యక్తికి మా ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా?'' అని ఎమ్మెల్యే గుడివాడ ప్రశ్నించారు. అంతేకాదు..

Recommended Video

    Vizag’s Rushikonda Beach Gets Blue Flag Certification | India’s Cleanest Beach Award || Oneindia
    అన్న చంద్రబాబు.. తమ్ముడు సబ్బం

    అన్న చంద్రబాబు.. తమ్ముడు సబ్బం

    అవినీతిలో పెద్ద నేతలకు మాత్రమే టీడీపీలో ఉన్నత పదవులు వస్తాయని, చంద్రబాబు కరకట్ట భూమిపై ఇంద్రభవనం కట్టి అవినీతికి అన్నలా ఉంటే.. విశాఖలో పార్కు స్థలాన్ని కబ్జా చేసిన సబ్బం హరి అవినీతిలో చంద్రబాబుకు తమ్ముడిలాంటి వాడని వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు. విశాఖలో వైసీపీ నేతలు భూముల్ని కబ్జా చేశారని ఆరోపిస్తోన్న టీడీపీ.. ఒక్క ఆరోపణనైనా రుజువు చేయగలదా? చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖలో టీడీపీ నేతలు భూకుంభకోణాలకు పాల్పడింది నిజం కాదా? అని అమర్ నాథ్ రెడ్డి నిలదీశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+