కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హడావిడి: పాట పడిన నేత..

అప్పుడప్పుడు నేతలు తమ కళను బయటకు తీస్తారు. కొందరు డ్యాన్స్ చేస్తే.. మరికొందరు పాడతారు. అయితే పెళ్లిలో.. నలుగురిలో పాడటం, ఆడటం కామన్ విషయం కాదు. ఎందుకంటే డైలీ లైఫ్‌లో బిజీగా ఉండేవారు. ఒక్కసారిగా.. సరదాగా గడపడం అంతా వీజీ కాదు.. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖలో ఘనంగా జరిగింది. ఎంజీఎం పార్కులో వైభవంగా జరిగిన పెళ్లివేడుకలో పాట కచేరీ కూడా ఏర్పాటు చేశారు.

కుమార్తె పెళ్లి సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా మైక్ అందుకుని ఉత్సాహంగా పాటలు పాడారు. ఆల్ టైమ్ హిట్ సాంగ్ నన్ను దోచుకుందువతే వన్నెల దొరసానీ అంటూ పాడారు. ఆ పాటను మధురంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడున్న వారు ఈలలు వేసి మరింత ఉత్సాహపరిచారు. ఆ పాటకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

 ysrcp mla karanam dharmasri sings a song

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రెండో కుమార్తె వివాహం చరణ్‌తో జరిగింది. వైజాగ్ బీచ్ రోడ్డులో గల ఎంజీఎం పార్కులో నిన్న ఘనంగా జరిగింది. పెళ్లికి వైసీపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వధువరూలను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించి.. ఎమ్మెల్యే పాట మాత్రం హైలెట్‌గా నిలిచింది.

కూతురు పెళ్లి సందర్భంగా ధర్మ శ్రీ... తన కళను వెలికితీశారు. అయితే ఆయన ప్రొఫెషనల్ సింగర్ మాదిరిగా పాడారు. మ్యూజిక్‌కు అనువుగా పాట పడి.. అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశారు. పాట పడినంత సేపు అక్కడున్న వారంతా ఈలలతో మారుమోగింది. ధర్మ శ్రీ మాత్రం నన్ను దోచుకుందువటే అంటూ రాగం తీస్తూ చక్కగా పాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+