జగన్ సభలో ఎమ్మెల్యే పెట్ల ఊర మాస్ డైలాగ్స్ జాతర: అయ్యన్నపాత్రుడికి సెగ తగిలేలా

అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1,000 కోట్ల రూపాయల అంచనాతో తలపెట్టిన ప్రాజెక్టులవి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధించారు.

టీడీపీ కంచుకోట..

టీడీపీ కంచుకోట..

కాగా- రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం.. కావడం వల్ల అందరి దృష్టీ ఈ సభపై నిలిచింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సొంత నియోజకవర్గం. ఆరుసార్లు ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో 23 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అలాంటి చోట మెడికల్ కాలేజీ సహా పలు అభివృద్ధి పనులకు స్వయంగా ముఖ్యమంత్రి చేపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

మాస్ డైలాగ్స్..

మాస్ డైలాగ్స్..

ఈ సభలో పెట్ల ఉమాశంకర్ గణేష్ చేసిన ప్రసంగం అభిమానులను కేరింతలు కొట్టించింది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఆయన స్వయానా సోదరుడు. జగన్‌ రాకతో నర్సీపట్నానికి సంక్రాంతి పండగ ముందే వచ్చిందని అన్నారు. 500 కోట్ల రూపాయలతో మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, 470 కోట్ల రూపాయలతో తాండవ-ఏలేరుకు నీటి అనుసంధాన కాల్వల నిర్మాణం,16 కోట్ల రూపాయలతో నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారాం..

ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారాం..

2019 ఎన్నికల ప్రచారం శంఖారావాన్ని నర్సీపట్నం నుంచే పూరించినట్లు పెట్ల ఉమాశంకర్ గుర్తు చేశారు. అందుకే ఈ నియోజకవర్గానికి 1,700 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని అన్నారు. నర్సీపట్నం గ్రేడ్‌- 3 మున్సిపాలిటీ అయినందున పన్నులు తగ్గించాలంటూ తాను ఎప్పటి నుంచో కోరుతున్నానని, అయిదేళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు ఏ మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

 తాగుబోతు కావడం వల్లే..

తాగుబోతు కావడం వల్లే..

ఒక తాగుబోతు నాయకుడు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండటంతోనే ఈ ప్రాంతానికి ఈ దుస్థితి వచ్చిందంటూ పెట్ల ఉమాశంకర్ మండిపడ్డారు. అయిదు సంవత్సరాలు మంత్రిగా పని చేసిన అయ్యన్నపాత్రుడు ట్యాక్స్‌లు తగ్గించలేదని, ఇప్పుడు మళ్లీ తాము అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తానని హామీ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ సారథ్యంలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన ఏడాదిలోనే 25 శాతం పన్నులు తగ్గించారని గుర్తు చేశారు..

ఓటు వేయకపోయినా..

ఓటు వేయకపోయినా..

తాను ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోయినప్పటికీ.. జగన్ తమకు రూ.3 నుంచి రూ.4 లక్షల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల కింద లబ్దిగా మంజూరు చేశారని స్థానిక టీడీపీ ఓటర్లు సైతం చెబుతున్నారని పెట్ల గణేష్ అన్నారు. జగన్ ను తాము గుండెల్లో పెట్టుకుంటామని, మరో 30 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ప్రత్యర్థి పార్టీల ఓటర్లు కూడా ఆశీర్వదిస్తోన్నారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా జగన్ పరిపాలన సాగిస్తోన్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+