మావోయిస్టుల ధుశ్చర్య: కాంట్రాక్టర్ హత్య.. వాహనాలు ధ్వంసం..
మావోయిస్టులు మరోసారి పెట్రేగిపోయారు. ఈ సారి కాంట్రాక్టర్ లక్ష్యంగా దాడి చేశారు. మావోల దాడిలో కాంట్రాక్టర్ ప్రాణాలు వదిలారు. తర్వాత వాహనాలను కూడా ధ్వంసం చేశారు. నక్సలైట్ల చర్యతో సుక్మాలో ఒక్కసారిగా మునుపటి పరిస్థితి నెలకొంది. భీతవాహ సిచుయేషన్ ఏర్పడింది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను హతమార్చారు. అక్కడే ఉన్న వాహనాలను దహనం చేశారు. సుక్మా జిల్లా మాథిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల గోలియాగూడలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన మావోయిస్టులు తొలుత మూడు వాహనాలకు నిప్పటించారు. తర్వాత మిగతావాటిని దగ్దం చేశారు. ఆ వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

అక్కడ ఉండి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ను హతమార్చారు. బుధవారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ సహచరున్ని పోలీసులు కాల్చి చంపారనే ఆగ్రహంతో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసు బలగాలు చేరుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications