విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై చంద్రబాబు రాజకోట రహస్య కుట్ర - నాడు ఇలాగే..!?

|
Google Oneindia TeluguNews

విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి ఆందోళనలో భాగంగా ఆయన ఇక్కడ రోడ్ షోలను నిర్వహించారు. స్థానికంగా ఉన్న కోట కూడలిలో రోడ్ షో చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి ఆయన రాజకోట బంగళాలో బస చేశారు.

 జగన్ ప్రభుత్వంపైనే..

జగన్ ప్రభుత్వంపైనే..


వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని, ఇక ఎంతోకాలం వైసీపీ పాలన ఉండబోదని చంద్రబాబు అన్నారు. తగిన సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తోన్నారని, రాష్ట్రంలో సైకో వైఎస్ జగన్ పాలన పోయి.. తెలుగుదేశం పార్టీ సారథ్యంలో సైకిల్ పాలన రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్‌ కు రాష్ట్రాభివృద్ధి ఏ మాత్రం పట్టదంటూ చంద్రబాబు ఘాటు విమర్శలు సంధించారు.

రివర్స్ పాలన..

రివర్స్ పాలన..

జగన్‌ కు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో తెలియదని, అందుకే రాష్ట్రం రివర్స్ లో సాగుతోందని ధ్వజమెత్తారు చంద్రబాబు. విధ్వంసం చేయడం సులువేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయడం చాలా కష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించానని, ఎలా అభివృద్ధి పరచాలో తనకు బాగా తెలుసునని అన్నారు. ఆ అనుభవం తనకు ఉందని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ద్రోహం వైఎస్ జగన్ ఈ రాష్ట్రానికి చేశాడని చంద్రబాబు ఆరోపించారు.

 కోలగట్ల అనుమానాలు..

కోలగట్ల అనుమానాలు..

విజయనగరం రోడ్ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పలు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి విజయనగరంలో చంద్రబాబు బసపై ఆయన అనుమానాలను లేవనెత్తారు. గతంలో రాజకోట కుట్రకు ఎన్టీ రామారావు పదవీచ్యుతుడయ్యారని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు పదవీచ్యుతుడు కావడానికి ముందు చంద్రబాబు అదే బంగళాలో బస చేశారని, ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

మళ్లీ అలాంటి కుట్ర..

మళ్లీ అలాంటి కుట్ర..

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అలాంటి కుట్ర పన్నుతున్నారంటూ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. రాజకోట బంగళాలో రాత్రి బస చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారనే అనుమానం ఉందని చెప్పారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినట్టే ఇప్పుడు కూడా జగన్‌పై ఏదో జరుగుతోందని కోలగట్ల పేర్కొన్నారు. దీనిపై అన్ని విషయాలు త్వరలోనే తేలుతాయని, చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇక సాగబోవని, ఆయనను ఎప్పుడో ప్రజలు ఛీత్కరించారని విమర్శించారు.

English summary
Deputy Speaker Kolagatla Veerabhadra Swamy raised the doubts on Chandrababu's Vizianagaram tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X