విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం..30 ఇళ్లు దగ్ధం
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెంటాడ మండలం జక్కువ గ్రామంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధం అయ్యాయి. మంటలు సమీప నివాసాలకు వ్యాపిస్తున్నాయి. ఇళ్లల్లోని గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు.

ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీప నివాసాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో గ్రామస్థులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. కోట పొలినాయుడు ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications