• search
  • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భోగి పండుగ విశిష్టత.. ఈ పండుగ ఉండని గ్రామాలెన్నో?

|

విజయనగరం : సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.

పాతకు స్వస్తి.. కొత్తకు ఆహ్వానం

పాతకు స్వస్తి.. కొత్తకు ఆహ్వానం

భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి.. కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ.

ఆ పల్లెల్లో కనిపించని సందడి..!

ఆ పల్లెల్లో కనిపించని సందడి..!

భోగికి అంత ప్రాశస్త్యమున్నా.. విజయనగరం జిల్లాల్లోని కొన్ని పల్లెలు పండుగకు దూరంగా ఉంటున్నాయి. ఆనాదిగా వస్తున్న ఆచారంతో ఆ పల్లెలు భోగి పండుగను జరుపుకోవడం లేదు. పూర్వీకులు చెప్పినవిధంగా నేటి తరం కూడా పండుగ చేసుకోవడం లేదు. ఈనాటి పిల్లలకు కొందరికైతే భోగి పండుగ గురించి కూడా తెలియదు.

మంటలు వేసుకోవడం, యువత కేరింతలు, వృద్ధుల ఆనందం, అందరూ ఒక్కచోట చేరి పండుగ చేసుకోవడం.. ఇవన్నీ కూడా ఆ పల్లెల్లో కనిపించవు. ఇదంతా కూడా ఆ పల్లెల్లో దశాబ్ధాలుగా వస్తున్న ఆచారం. పూర్వం ఏదో జరిగిందనే కారణంతో ఈనాటికి భోగి పండుగకు దూరంగా ఉండటం గమనార్హం.

భోగి లేని పల్లెలు..!

భోగి లేని పల్లెలు..!

తెర్లాం మండలం తమ్మయ్య వలసలో భోగి పండుగ జరగకపోవడానికి ఓ కారణముంది. పూర్వకాలంలో భోగిమంట వేసిన రోజు.. గ్రామంలో ఏదో అరిష్టం జరిగిందట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పండుగ ఊసే లేదు. కుమ్మరిపేట గ్రామంలో దాదాపు భోగెల గోత్రంతో ఉన్నవాళ్లు కనిపిస్తారట. ఆనాడెప్పుడో భోగి రోజున మంట వేయడం వల్ల ఏదో అపచారం జరిగిందని పూర్వీకులు చెప్పడంతో ఇప్పటికీ పండుగకు దూరంగా ఉంటున్నారు ఈ గ్రామ ప్రజలు.

బలిజపేట మండలంలోని సుభద్ర పంచాయతీ పరిధిలోని బడేవలస గ్రామంలో కూడా భోగి పండుగ కనిపించదు. వందేళ్ల కిందట ఇక్కడ జరిగే భోగిమంటల్లో ప్రమాదవశాత్తు ఒకరు మరణించారట. దీంతో పండుగ జరుపుకోవడం లేదట. రామభద్రపురం మండలం తారాపురం, బాడంగి మండలం పిన్నవలస, ముగడ గ్రామాల్లో కూడా భోగి పండుగ అంటే తెలియదు. అప్పుడెప్పుడో జరిగిన విషాద ఘటనలతో పూర్వీకులు పండుగ చేయలేదని అదే ఆచారం తాము పాటిస్తున్నామంటారు స్థానికులు.

English summary
Bhogi festival gaves a good message that leave old things and welcome to new. Some Villages of Vizianagaram district are not celebrating bhogi festival. As per old tradition, the villagers are not accepting bhogi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X