విజయనగరంలో ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు...
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి మండలం పుర్రెయవలస వద్ద యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు అంటున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

చీపురుపల్లిలో రోడ్ షో ముగించుకొని వెళ్తుండగా ప్రమాద ఘటన వద్ద చంద్రబాబు ఆగారు. క్షతగాత్రులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదంతో జిల్లాలో ఒక్కసారిగా కలకల రేగింది.












Click it and Unblock the Notifications