• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నాలుగేళ్ల ప్రేమ నాలుగు నిముషాల్లో కాదందని .. ప్రియురాలి ఇంటిముందే ...

|

వారిద్దరూ ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒక నెలా, రెండు నెలలు కాదు .. ఏకంగా నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇక అంతా సెట్ చేసుకుని పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు. వారి ప్రేమకు ఏమైందో తెలీదు కానీ ఒకరోజు అమ్మాయి అతనంటే తనకు ఇష్టం లేదని పెద్ద మనుషులందరి ముందు చెప్పింది. ప్రేమించిన అమ్మాయి కాదన్న అవమాన భారంతో ఆ ప్రేమికుడు ఏం చేశాడో తెలుసా ?

నాలుగేళ్ల పాటు తనను ప్రేమించి, చెట్టాపట్టాలేసుకు తిరిగి, చివరకు పెళ్లి దాకా వచ్చాక ఇప్పుడు పెళ్లిని కాదన్నదన్న అవమానంతో ఓ యువకుడు, తన ప్రియురాలి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. సమ్మక్క- సారలమ్మ తాడ్వాయి మండల పరిధిలో కాల్వపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం చల్వాయికి చెందిన జక్కుల మహేందర్‌ (25) అనే యువకుడు, కాల్వపల్లికి చెందిన ఓ యువతి గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

4 years of love rejected in four minutes.. before the girls house .....

ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. విషయం తెలుసుకున్న ఇరువురి బంధువులు, పెద్ద మనుషులు కూడా అంగీకరించారు. అంతా ఓకే అనుకున్నాక సడన్ గా అమ్మాయి ట్విస్ట్ ఇచ్చింది. అమ్మాయిని పిలిపించి మాట్లాడేసరికి, తాను మహేందర్‌ ను లవ్ చేయలేదని, పెళ్లి చేసుకోబోనని ఆమె తెగేసి చెప్పింది.

టీడీపీది కుల రాజకీయం .. వైసీపీది మత రాజకీయం అని పురంధరేశ్వరి ఫైర్

ప్రేమించిన అమ్మాయి పెళ్లి దాకా వచ్చాక కాదందని , అది కూడా అందరి ముందు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిందని భావించిన ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో తనకు అవమానం జరిగిందన్న ఆవేదనలో , అమ్మాయి ఇంటికి వెళ్లిన మహేందర్, అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు..

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to a police report on the incident at Kalvapalli under the Sammakka-Saralamma Tadvai zone, a young man from Jakkula Mahender (25) from Chalwai and a young woman from kalvapally have been in love for the past four years. Since both of them are the same social group, they wanted to get married. Knowing the matter, both relatives and gentlemen agreed.. The girl gave a twist as soon as everything was okay. When they called the girl, she denied that she did not love Mahender. On the excitement of his being humiliated, Mahender went to the girl's house, where he drank festicide and committed suicide. He died on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more