నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం: గొంతు కోసుకున్న వ్యక్తి, పరిస్థితి విషమం

వరంగల్: ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది. అంతేగాక, అతను తన చావుకు స్థానిక ఎమ్మెల్యేనే కారణమంటూ లేఖ రాయడం గమనార్హం. స్థానిక అదాలత్ వద్ద అమరవీరుల స్తూపం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.

చాకుతో గొంతుకోసుకుని అక్కడే పడిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న అతడ్ని స్థానికులు గమనించి.. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతనికి వైద్యం అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

A man attempted to commit suicide in hanamkonda.

ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని బ్యాగును పరిశీలించగా ఓ సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కారణమని వెంకటేశ్వర్లు అందులో పేర్కొన్నాడు.

వచ్చే ఎన్నికల్లో సుదర్న్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌కు అతడు తన లేఖలో కోరాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+