• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం.. అల్లుడిని చితక్కొట్టిన అత్తమామలు.. ఉతికి ఆరేశారుగా (VIDEO)

|

వరంగల్ : అక్రమ సంబంధాలతో వివాహ బంధాల పరువు తీస్తున్నారు కొందరు. అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసి కట్టుకున్న భార్యను కాదనుకుంటున్నారు. ఆ క్రమంలో పర స్త్రీల వ్యామోహంలో భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వివాహేతర బంధాలతో పరువు తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వరంగల్ జిల్లాలో మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ భర్త తాట తీశారు భార్య తరపు బంధువులు. అత్తమామలు తిత్తి తీశారు. తమ కూతురుకు అన్యాయం చేస్తావా అంటూ ఇష్టమొచ్చినట్లు చితక బాదారు.

కాపురాలు కూల్చుతున్న అక్రమ సంబంధాలు

కాపురాలు కూల్చుతున్న అక్రమ సంబంధాలు

అక్రమ సంబంధాలు కాపురాలు కూల్చుతున్నాయి. పెళ్లైన తర్వాత కూడా భర్తలు పక్క చూపులు చూస్తుండటం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తనను నమ్ముకుని వచ్చిన భార్యను కాదనుకుని ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్న భర్తల లీలలు బయట పడుతూనే ఉన్నాయి. తప్పు చేసినోళ్లు ఏదో రోజు చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే అనేదానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. అదే క్రమంలో వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన అక్రమ సంబంధం ఓ కుటుంబంలో చిచ్చు రేపింది.

వరంగల్ ఆర్టీసీ సమ్మె తోపులాట.. మహిళ కొంగు లాగారంటూ.. సీపీ వివరణ

అత్తమామలు తిత్తి తీశారు.. నడిరోడ్డుపై కొట్టుకుంటూ..!

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో జరిగిన ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. భార్యను కాదని మరో వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భర్త గుట్టు రట్టైంది. హన్మకొండకు చెందిన కుమార స్వామి అనే వ్యక్తికి వర్ధన్న పేటకు చెందిన శిరీషతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుంచి భార్యను వేధిస్తున్న కుమార స్వామి తనను తరచుగా కొట్టేవాడని శిరీష ఆరోపిస్తున్నారు.

అంతేకాదు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి తన జల్సాల కోసం వాడుకున్నాడనేది ఆమె వెర్షన్. పోనీలే అని సర్దుకుని కాపురం చేస్తున్నప్పటికీ అతడు మాత్రం మరో వివాహితతో సంబంధం పెట్టుకుని.. రెండు సంవత్సరాల కిందట తనను వదిలేశాడని వాపోయారు. అతడిపై ఓ కన్నేసిన శిరీష కుటుంబ సభ్యులు అదను చూసి అతడిపై అటాక్ చేశారు. అత్తమామతో పాటు బామ్మర్ధి కూడా చేయి చేసుకున్నారు. నడిరోడ్డుపై కొట్టుకుంటూ ఇంటికి ఈడ్చుకెళ్లారు.

 ఆ మధ్య హైదరాబాద్‌లో రెండు ఘటనల్లోనూ ఇలాగే

ఆ మధ్య హైదరాబాద్‌లో రెండు ఘటనల్లోనూ ఇలాగే

జులై చివరి వారంలో హైదరాబాద్‌లో వెలుగు చూసిన రెండు ఘటనలు అక్రమ సంబంధాల తుట్టెలు కదిలించాయి. మంచిర్యాల జిల్లా కొత్తగూడెంకు చెందిన లక్ష్మణ్‌కు పెళ్లయింది. అయితే భార్యను కాదని మరో వివాహితతో కలిసి వేరే కాపురం పెట్టాడు. ఆమె కూడా భర్తను వదిలేసి ఇతగాడితో జీవించింది. అది కాస్తా మొదటి భార్యకు తెలిసి వారు నివసిస్తున్న ఇంటిపై దాడి చేశారు. కెమెరాల సాక్షిగా ఆమె భర్తను, అతడితో కలిసి ఉంటున్న మరో మహిళను చితకబాదారు.

ఇలాంటి ఘటనే చింతల్‌లో మరొకటి వెలుగుచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారెపాకకు చెందిన లావణ్యకు.. కృష్ణ జిల్లా నరసరావు పాలెంకు చెందిన సుధాకర్‌తో 2015లో పెళ్లైంది. పెళ్లి సమయంలోనే అతనికి 40 లక్షల కట్నం ఇచ్చారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే చిన్నారి అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని చింతల్‌లో కాపురం పెట్టాడు. విషయం తెలిసిన మొదటి భార్య వారు కాపురముంటున్న ఇంటికొచ్చి దుమ్ము దులిపారు.

ఇవేమీ ఆశీస్సులు సామీ.. తలపై కాలు పెట్టి.. వైరల్ వీడియో

 వివాహ బంధాల అర్థం మార్చుతూ..!

వివాహ బంధాల అర్థం మార్చుతూ..!

వివాహ బంధాలకు అర్థం మారుస్తున్నారు కొందరు. దైవసాక్షిగా పెళ్లిళ్లు చేసుకుంటూ అక్రమ సంబంధాలతో వివాహాల పరమార్థం మార్చుతున్నారు. కడదాకా తోడుంటానంటూ పచ్చని పందిరిలో బాసలు చేస్తూ మధ్యలోనే దారి తప్పుతున్నారు. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో ఆనందంగా గడుపుతారని పెద్దలు అనుకుంటుంటే అక్రమ సంబంధాల కారణంగా బంధాల అనుబంధాలను తుంచేస్తున్నారు. ప్రేమ వర్ధిల్లాల్సిన చోట అసూయ, ద్వేషం రాజ్యమేలుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

English summary
Illegal marital affairs cause to family disturbance. in warangal district, one husband continues illegal affair with another married woman. His wife father and mother caught him and beaten brutally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more