హవ్వా.. లిక్కర్ మాఫియాతో ఖాకీలకు లింకు..? ఏకంగా హనీట్రాపే..
వరంగల్ లిక్కర్ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. లిక్కర్ మాఫియాతో పోలీసులకు లింకులు ఉన్నట్టు సమాచారం. మద్యం మాఫియా కుంభకోణంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఇంటెలీజెన్స్, టాస్క్ ఫోర్స్ బృందాలు.. లిక్కర్ సిండికేట్ ఆర్థిక వ్యహారాలను నిశీతంగా పరిశీలిస్తున్నారు. ప్లైట్ టికెట్స్, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు, మాల్స్‌లో షాపింగ్ చేసినట్టు గుర్తించారు.
మద్యం సిండికేట్ నుంచి పెద్ద ఎత్తున చెల్లించిన ముడుపులకు సంబంధించి డైరీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కొన్నేళ్లుగా మద్యం మాఫియా గుప్పెట్లోకి వెళ్లిన పోలీసు అధికారులు.. మాఫియా చెప్పినట్టుగా ఆడుతున్నారు. వరంగల్ కమిషనరేట్‌కు చెందిన 18 సీఐలు, 4 ఏసీపీలకు సంబంధించిన వివరాలను ఐబీ అధికారులు సేకరించారు.

మద్యం వేలం పాటలు, బ్యాంకులో తనఖా పడ్డ ఆస్తుల వేలం, వివాదాస్పద భూముల కొనుగోళ్లలో బినామీలతో పోలీసుల కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. పోలీసుల అక్రమ దందాపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరిస్తోంది. వరంగల్‌లో లిక్కర్ మాఫియా అక్రమ సంపాదనే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతోంది. దందా కోసం ఏకంగా పోలీసులనే ట్రాప్ చేశారు. అమ్మాయిలను ఎరవేసి సీఐలను ట్రాప్ చేసినట్టు తెలిసింది. పోలీసులు ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసింది. వెంటనే చర్యలు ప్రారంభించారు.
లిక్కర్ మాఫియా అక్రమాలపై కూపీ లాగుతున్నారు. పోలీసులకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తపై రహస్యంగా కంప్లంట్ వచ్చింది. తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి రంగంలోకి దిగారు. తీగ లాగితే డొంక కదిలినట్టు.. హానీట్రాప్ వ్యవహారం వెలుగుచూసింది. తమ దందా కోసం మాఫియా తెగించిందని అర్థమవుతోంది. పోలీసులు కూడా వారికి లొంగడం.. వంతపాడటంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో పోలీసు బాసులు వెంటనే స్పందించారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వారందరినీ గుర్తించి.. రేపో, మాపో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఓరుగల్లులో ఈ హానీట్రాప్ వ్యవహారం మాత్రం పెద్ద దుమారమే రేపింది.












Click it and Unblock the Notifications