వన్ నేషన్.. వన్ దోస్త్: మోడీ-అదానీపై కేటీఆర్ సెటైర్లు, ప్రీతి కుటుంబానికి పరామర్శ

వరంగల్: ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నరేంద్ర మోడీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ సెటైర్లు వేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కేంద్రం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

వన్ నేషన్.. వన్ దోస్త్ అంటూ మోడీ-అదానీపై కేటీఆర్

వన్ నేషన్.. వన్ దోస్త్ అంటూ మోడీ-అదానీపై కేటీఆర్

ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. నల్లధనం తెస్తానని మోడీ చెప్పారని.. మరి తెచ్చారా? ఆ డబ్బు పంచారా? అని ప్రశ్నించారు. వన్ నేషన్ వన్ రేషన్, వనేషన్ వన్ ట్యాక్స్ అన్నారు.. ఇప్పుడు కొత్తగా వన్నేషన్ వన్ ఫ్రెండ్ తీసుకొచ్చిండు అని.. మొత్తం దోస్తుకు దోచిపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మోడీ, అదానీ మిత్రులంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దొంగ సొమ్ముతో బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనేందుకు, ప్రభుత్వాలను కూల్చేందుకు, పార్టీలను చీల్చేందుకు ఉపయోగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వ హయాంలో అన్ని ధరలు పెరిగాయన్నారు.

కేంద్రం చేసిందేం లేదంటూ కేటీఆర్ ఫైర్

కేంద్రం చేసిందేం లేదంటూ కేటీఆర్ ఫైర్

ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకుపోయారని కేటీఆర్ చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడతామని పెట్టలేదన్నారు. మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఒక్క మంచిపని అయినా చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ప్రజల మనసుల్లో నిలిచేలా పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ ను కాపాడుకుందామన్నారు.

ఎర్రబెల్లి గొప్ప పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటూ కేటీఆర్ ప్రశంస

ఎర్రబెల్లి గొప్ప పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటూ కేటీఆర్ ప్రశంస

రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సిరిసిల్ల కంటే ఎక్కువ మెజార్టీ తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు దేశంలోనే గొప్ప పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్నారు. మరోవైపు, ప‌ర్వ‌త‌గిరి మండ‌లం ఏనుగ‌ల్లులో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఏనుగ‌ల్లులో క్యాన్స‌ర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏనుగ‌ల్లులో నైపుణ్యం కేంద్రం ఏర్పాటు చేస్తామ‌న్నారు. 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని కేటీఆర్ తెలిపారు.

ప్రీతి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

ప్రీతి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

ఇది ఇలావుండగా, ఇటీవల మృతి చెందిన కేఎంసీ డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతి కుటుంబాన్ని కలిశారు. ప్రీతి మృతి అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దోషులు ఎవరైనా.. వదిలేదని.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రీతి కేసుపై సీపీతో కేటీఆర్ మాట్లాడారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+