• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బండి సంజయ్ పాదయాత్రలో పొలిటికల్ హీట్; టెన్షన్ వెనుక కారణాలివే!!

|
Google Oneindia TeluguNews

ఓరుగల్లు వేదికగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. అగ్ర నాయకులు వ్యాఖ్యలే బిజెపి, టిఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొడుతున్నాయి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బండి సంజయ్ పాదయాత్రతో ఓరుగల్లు వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అసలు ఎందుకు ఎక్కడా లేని ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కనిపిస్తుంది అంటే అందుకు ఆసక్తికర కారణాలు ఉన్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్షన్ పెడుతున్న బండి సంజయ్ పాదయాత్ర


ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎంటర్ అయిన నాటినుండి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ రెండు విడతల పాదయాత్రలో చోటుచేసుకోని ఉద్రిక్తత మూడో విడత పాదయాత్రలో వరంగల్ జిల్లాలో చోటుచేసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ జిల్లాలో కాషాయం పట్టుసాధిస్తుందేమోననే భయం అధికార టీఆర్ఎస్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

గులాబీ నేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం.. టీఆర్ఎస్ లో టెన్షన్

గులాబీ నేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం.. టీఆర్ఎస్ లో టెన్షన్


తీవ్ర అంసతృప్తిలో ఉన్న కారు నేతలు బీజేపీ గూటికి చేరడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం ఉండడంతో టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువైంది. దానికి బండి సంజయ్ పాదయాత్ర జిల్లాలోని రాజకీయ సమీకరణాలను ఎక్కడ తారుమారు చేస్తుందోననే అనుమానాలు కలగడంతో టిఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు బీజేపీకి గతంలో కంచుకోటగా ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్ర సర్కార్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రణాళికలు రచించి ముందుకెళ్తున్నారు.

 దేవరుప్పల ఘటనతో మొదలైన ఉద్రిక్తత .. సవాళ్లు, ప్రతి సవాళ్లు

దేవరుప్పల ఘటనతో మొదలైన ఉద్రిక్తత .. సవాళ్లు, ప్రతి సవాళ్లు


దీంతో జనగామ జిల్లాలోని దేవరుప్పుల ప్రాంతంలో యాత్ర ఎంటర్ కావడంతోనే నిరసనలు వెల్లువెత్తాయి. బండి సంజయ్ మాట్లాడుతున్న క్రమంలోనే టీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకించడంతో పరస్పరం నినాదాలతో ఆప్రాంతమంతా హోరెత్తింది. దీంతో భౌతిక దాడి వరకు ఇరు పార్టీల కేడర్లు దూసుకెళ్లి ఆస్పత్రి పాలయ్యారు. ఇక తగ్గేది లేదన్నట్టు అప్పటికప్పుడు బండి సంజయ్ డీజీపీకి ఫోన్ చేసి తలంటినంత పని చేశారు. సీపీకి చేతకాకపోతే ఇంట్లో కూర్చోమని చెప్పండి, మిగతా వ్యవహారం మేమే చక్కబెట్టుకుంటామని ఘాటుగానే మాట్లాడారు. తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక గులాబీ శ్రేణులు నీచరాజకీయాలకు దిగజారుతున్నాయని బండి ఘాటుగా విమర్శించారు.

బండి సంజయ్ పై ప్రతిఘటన... బలమైన కారణమే

బండి సంజయ్ పై ప్రతిఘటన... బలమైన కారణమే


ఇక మంత్రి ఎర్రబెల్లి బండి సంజయ్ పై ఎదురుదాడి చేశారు. దాడులు చేసిన బీజేపీ గూండాలను వదిలిపెట్టేది లేదన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఇక ఆ సవాల్ కు బీజేపీ నేతలు దీటుగా స్పందించారు. ఎక్కడా తగ్గకుండా రెండు పార్టీలు తలపడుతున్న తీరు కాసింత ఆశ్చర్యాన్ని కలిగించినా, ఇంతగా బండి సంజయ్ పాదయాత్రపై ప్రతిఘటన వెనుక టీఆర్ఎస్ పార్టీకి బలమైన కారణమే ఉంది.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ వంటి నేతల రాజీనామాలతో టీఆర్ఎస్ కు టెన్షన్

ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ వంటి నేతల రాజీనామాలతో టీఆర్ఎస్ కు టెన్షన్


బండి సంజయ్ యాత్ర ఆద్యంతం సర్కార్ వైఫల్యాలు, బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ సాగుతుండడంతో కారు పార్టీ టెన్షన్ పడుతోంది. ఇప్పటికే వరంగల్ లో తూర్పు నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు వంటి ప్రజాదరణ కలిగిన నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కన్నెబోయిన రాజయ్య యాదవ్ వంటి వారు గులాబీ అధినేతపై విమర్శలు చేసి పార్టీ వీడడం వెరసి టిఆర్ఎస్ పార్టీలో ఇంకెంత మంది వలస వెళతారో అన్న ఆందోళన కనిపిస్తుంది.

బీజేపీ జిల్లాలో బలపడుతుందన్న భయంలో టీఆర్ఎస్

బీజేపీ జిల్లాలో బలపడుతుందన్న భయంలో టీఆర్ఎస్


ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ బలపడుతుందన్న భయం టిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంటే, కారుకు బ్రేక్ వేసి టిఆర్ఎస్ పార్టీ నేతలను బిజెపి బాట పట్టించాలని బండి సంజయ్ టీం శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేరికలపై శరవేగంగా పావులు కదుపుతూ ఈటల రాజేందర్ జిల్లాపై దృష్టి సారించారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు, కొందరు నేతలతో మంతనాలు జరిపి చేరికలకు వ్యూహాలు రచిస్తున్నారు.

24 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పాదయాత్ర .. వలసలపై ఉత్కంఠ

24 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పాదయాత్ర .. వలసలపై ఉత్కంఠ


ఈ నెల 24 వరకు ఓరుగల్లులో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనున్న దృష్ట్యా వలసలపై ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మున్ముందు ఇరు పార్టీల మధ్య ఇంకెన్ని యుద్ధాలు జరుగుతాయనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని బీజేపీ టీఆర్ఎస్ మధ్య చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో కాంగ్రెస్ సరైన సమయం కోసం వేచిచూస్తున్న ధోరణి అవలంబిస్తోంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర రసవత్తర రాజకీయాలకు తెర తీసింది.

English summary
The main concerns behind the tension in Bandi Sanjay Padayatra in Warangal are the concern that TRS party leaders will defect to BJP and the fear that the BJP will gain strength in the Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X