రూ.1.20 లక్షలు హాంఫట్: ఓటీపీ చెప్పడంతో ట్రాన్స్‌ఫర్, పోలీసులకు ఫిర్యాదు
ఆన్ లైన్ మోసాలు యథేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. ఓటీపీ చెప్పొద్దని పోలీసులు, సైబర్ నిపుణులు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. అయినా కొందరీ చెవికి ఎక్కడం లేదో ఏమో.. వారు పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నారు.. ఇంకేముంది భారీగా నగదు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటన వరంగల్‌లో ఒకటి జరిగింది.
వరంగల్ 27వ డివిజన్‌లో గల రాంకీ విల్లాస్‌లో తోట అఖిల్ ఉంటున్నాడు. అయితే స్నేహితుడి బర్త్ డే కోసం ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఏందో కానీ.. అతని డబ్బులో నగదు గుల్లా అయిపోయింది. ఓటీపీ కోసం ఫోన్ రావడం చెప్పేయడం జరిగింది. రెండుసార్లు కాల్ రావడం.. చెప్పడంతో రూ.1.20 లక్షలు పోగోట్టుకున్నాడు.

ఆర్డర్ కన్ఫామ్ అంటూ కాల్ చేయడంతో నమ్మేశాడు. ఓటీపీ అడగానే చెప్పేశాడు. దాంతో ఫస్ట్ రూ.60 వేలు పోయాయి.బ్యాంకు ఖాతా నుంచి రూ.60 వేలు వేరే అకౌంట్‌కు వెళ్లినట్టు మెసేజ్ వచ్చింది. అదే నంబర్‌కు ఫోన్ చేసి ఖాతాలో నగదు ఎక్కువ మొత్తంలో ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పాడు.
తిరిగి ఓటీపీ వస్తుందని, అది చెబితే డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయని ఆ సంస్థ ప్రతినిధి సూచించాడు. అనిల్ ఖాతా నుంచి మరో రూ.60 వేలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. రూ.1.20 లక్షలు మోసపోయానని బాధితుడు గుర్తించాడు. మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications