పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

16 మంది మృతి.. జంగారెడ్డిగూడెంలో కలకలం, టీడీపీ ఆరోపణలు, మంత్రి నాని ఫైర్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు చనిపోతున్నారు ? మృతికి కారణం ఏంటీ ? అనేది అర్థం కావడం లేదు. మిస్టరీగా మారిన మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. వరుస మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బాబుకు షరామాములే..

బాబుకు షరామాములే..

మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. వివిధ వ్యాధులతో జనం చనిపోతున్నారని ఆర్డీవో చెబుతున్నారు. మరణాలపై మంత్రి పేర్ని నాని కూడా ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌తో మాట్లాడారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. శనివారం మరో ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత అసలు విషయాలు బయటకొస్తాయని, ఎందుకు చనిపోతున్నారనే విషయం తెలిసిపోనుందని తెలిపారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. శవరాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటై పోయిందని మండిపడ్డారు. జంగారెడ్డి గూడెం ఘటనపై బాబు అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏం చేస్తున్నారు..?

ఏం చేస్తున్నారు..?


ఇటు జంగారెడ్డి గూడెంలో జరుగుతున్న మరణాలపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇంత మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ప్రాణాలు పోతున్నా స్పందించరా? అని చంద్రబాబు నిలదీశారు. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Recommended Video

Eluru Mysterious Illness Who Team To Examine Situation 451 Cases So Far One Dead
 25 లక్షల పరిహారం

25 లక్షల పరిహారం


చౌక మ‌ద్యం అధిక ధ‌ర‌ల‌కి విక్రయిస్తున్నారని, ఆ మ‌ద్యం కొన‌లేక సారా తాగి ఇంత మంది బలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఎక్సైజ్‌, ఎస్ఈబీ, జ‌గ‌న్ అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వం, సంబ‌ధిత శాఖ స్పందించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోందన్నారు. జంగారెడ్డిగూడెం సారా మ‌ర‌ణాల‌పై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

English summary
16 people dead in west godavari district jangareddy gudem. to give rs.25 lakhs to kin families tdp asked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X