పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.21 కోట్ల కరెంట్ బిల్: చిన్న హోటల్‌కు బిల్ మోత.. వామ్మో అంటూ

|
Google Oneindia TeluguNews

కరెంట్ బిల్.. మినిమం బిల్ అయితే ఓకే.. అంతకన్నా ఎక్కువ వస్తేనే గగ్గొలు పడాల్సిన పరిస్థితి. అవును చాలా సందర్భాల్లో కరెంట్ బిల్ మోత మోగింది. తాము ఇంత బిల్ వాడమా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా సందర్భాల్లో వారి వేదనను చూశాం.. వేలు.. లక్షల బిల్ చూశాం. కమర్షియల్ బిల్ అయినా సరే.. కానీ రూ.కోట్లలో మాత్రం చూడలే. ఏపీలో ఓ చిన్న హోటల్‌కు రూ. కోట్ల బిల్ మోత మోగింది. దీంతో ఓనర్ గుండె గుబేల్ మంది. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు.

చిన్నా చితకా హోటళ్లకు, నివాస గృహాలకు ఓ వెయ్యిలోపు కరెంటు బిల్లులు వస్తుంటాయి. మహా అయితే ఇంకో ఐదు వందలు ఎక్కువ వస్తుందేమో! కానీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్‌కు వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతారు. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలి పరిస్థితి కూడా అదే. నెల కరెంట్ బిల్ రూ.21 కోట్ల మేర వేశారు. దాంతో ఆమె లబోదిబోమంటున్నారు.

hotel get power bill rs.21 crores at ap

ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు నివేదించారు. వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమె బిల్లును సరిచేసి కొత్త బిల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు భరోసా ఇచ్చిన తర్వాత గానీ ఆమె కుదుటపడలేదు. అప్పుడు ఆమె మనసు తేలిక పడింది. ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించారని చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్‌తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం వల్లే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని అధికారులు వివరించారు.

Recommended Video

AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu

కానీ హోటల్ నిర్వాహకులు మాత్రం గుండె ఆగినతం పని అయ్యింది. రూ.21 కోట్ల అంటూ నోరు తెరిచారు. ఏం చేయాలిరా భగవంతుడా అంటూ.. ఎలక్ట్రిసిటీ అధికారులకు విషయం తీసుకెళ్లారు. వారు భరోసా ఇవ్వడంతో.. మనసు కాస్త కుదుటపడింది. అధికారులపై చర్యలు తీసుకోవడంతో ప్రశాంతంగా ఉన్నారు. తన బిల్ తక్కువేనని తెలుసుకొని రిలాక్స్ అయ్యారు.

English summary
a small hotel get power bill rs.21 crore. incident happened at andhra pradesh west godavari district chintalapudi village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X