చిన్నప్పుడు నర్సాపురం బస్టాండ్‌లో తప్పిపోయా: పవన్ కల్యాణ్
భీమవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. ఇవ్వాళ పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని నర్సాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎప్పట్లాగే- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తన మాటల దాడి తీవ్రతను పెంచారు. జనసేన అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీల గురించి వివరించారు. తనకు ప్రాణాపాయం ఉందనే విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు.
తాను సాగిస్తోన్న ఈ సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పులివెందుల నుంచి కొందరు నర్సాపురాన్ని ఆక్రమించుకుంటోన్నారని, ప్రత్యేకించి- ఇక్కడి ఆక్వా వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంటోన్నారని ధ్వజమెత్తారు. వారి వల్ల జిల్లాలో ప్రశాంతత కరవైందని ధ్వజమెత్తారు. ఎక్కడినుంచో వచ్చి ఇక్కడి వ్యాపార కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

ఎవరు ఎమనుకున్నప్పటికీ- ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో అడుగు పెట్టానని, మరో 25 సంవత్సరాల పాటు గొడ్డు చాకిరీ చేసే సామర్థ్యం తనకు ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి చేయడానికి తన వద్ద మాస్టర్‌ప్లాన్ ఉందని అన్నారు. ప్రజలు కోరుకున్న నిజమైన అభివృద్ధి జరగాలంటే జగన్ పాలన పోవాలని, జనసేన అధికారంలోకి రావాలని చెప్పారు.
జగన్ ప్రభుత్వం కాపులకు న్యాయం జరగదనే విషయంపై ఇప్పటికే స్పష్టమైందని, ఈ ఎన్నికల్లో మార్పు వస్తుందని తాను విశ్వసిస్తోన్నానని చెప్పారు. సమాజాన్ని ప్రక్షాళన చేయడం, పరివర్తన తీసుకుని రావడానికే ఎన్నికల్లో అడుగుపెట్టానని అన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రం వెనుకంజలో ఉందని, వైసీపీ నాయకుల కమీషన్ల బెదిరింపులకు వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను అధికారంలోకి వస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. తన వద్ద పని చేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 1వ తేదీన జీతం ఇవ్వలేకపోతోందని, రాష్ట్రాన్ని అలాంటి దుర్భర పరిస్థితులకు నెట్టేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రౌడీ మూకలను రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం పవన్ కల్యాణ్.. నర్సాపురంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. చిన్నప్పుడు తన తండ్రితో కలిసి పాలకొల్లు నుంచి నర్సాపురానికి వచ్చానని, అప్పటికి తన వయస్సు అయిదారేళ్లేనని పేర్కొన్నారు. నర్సాపురం బస్టాండ్‌లో బస్సు కోసమో, జట్కా బండి కోసమో ఎదురు చూస్తోండగా.. తాను తప్పి పోయానని చెప్పారు. అదృష్టం బాగుండి దొరికానని, లేదంటే ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండేవాడినని పవన్ కల్యాణ్ నవ్వుతూ చెప్పారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications