పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీబస్సు ప్రమాదం: విచారణకు ఆదేశించామన్న మంత్రి పేర్ని నాని; స్పందించిన చంద్రబాబు, లోకేష్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోవడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం దాదాపు 47 మంది ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఈ ప్రమాద ఘటనపై పలువురు స్పందిస్తున్నారు.

బస్సు ప్రమాద ఘటనపై ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని

బస్సు ప్రమాద ఘటనపై ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని


జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగులో పడిపోయిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి పేర్ని నాని చెప్పారు.

పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడకు లేదా హైదరాబాద్ కు తరలిస్తామన్న మంత్రి

పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడకు లేదా హైదరాబాద్ కు తరలిస్తామన్న మంత్రి

గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ చెప్పారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడకు లేదా హైదరాబాద్ కు తరలిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆర్డీవో తో పాటుగా ఎమ్మెల్యే ఘటనా స్థలంలో ఉన్నట్లు పేర్ని నాని తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని సహాయక చర్యలపై ఆరా తీశారని పేర్కొన్న పేర్ని నాని ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను తెలుసుకోవడానికి ఆర్టీసీ డిపో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... పార్టీ శ్రేణులకు సహాయం చెయ్యాలని పిలుపు


ఇదిలా ఉంటే జంగారెడ్డి గూడెం జల్లేరు వాగులో పడిపోయిన బస్సు ప్రమాద ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. జల్లేరు వాగు లోకి ఆర్టీసీ బస్సు దూసుకుపోవడంతో ప్రమాదానికి గురై బస్సు డ్రైవర్ తో పాటుగా పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు .ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని లోకేష్ డిమాండ్

మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని లోకేష్ డిమాండ్

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .మృతులకు అశ్రునివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని నారా లోకేష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుందని నారా లోకేష్ విమర్శించారు.

అధ్వానంగా ఉన్న రోడ్ల వల్లే ప్రమాదం .. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన


అద్వానంగా ఉన్న రోడ్ల వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోందని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రహదారులకు కేటాయించిన నిధులు దారి మళ్లించడంతో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయని, ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయని లోకేష్ జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక రోడ్లను పట్టించుకునే నాథుడు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందని లోకేష్ విమర్శించారు. ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణ ఘటన చోటు చేసుకుందని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
RTC bus accidentally fell in Jalleru stream in Jangareddygudem zone of West Godavari district, Nine people were died . AP minister perni Nani, Chandrababu and Lokesh responded to the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X