పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో షాకింగ్ ఘటన .. కరోనా భయంతో 15 నెలలుగా ఒకే గదిలో ఉన్న ముగ్గురు మహిళలు .. అన్నీ అందులోనే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి భయపడి గది నుండి బయటకు రాకుండా ముగ్గురు మహిళలు 15 నెలలుగా జీవనం సాగిస్తున్న ఘటన తాజాగా ఏపీ వాసులను షాక్ కు గురి చేసింది.

 పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనాకు భయపడి ముగ్గురు ఒకే గదిలో 15 నెలలుగా

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనాకు భయపడి ముగ్గురు ఒకే గదిలో 15 నెలలుగా

పశ్చిమగోదావరి జిల్లాలోని రాజోలు మండలం కడలి గ్రామంలో కరోనా మహమ్మారికి భయపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు 15 నెలల పాటు ఒకే గదిలో జీవనం సాగించారు. కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గరనుండి, తినడం, నిద్రపోవడం ప్రతి ఒక్కటి ఆ గదిలోనే చేశారు. 15 నెలలుగా గది నుండి బయటకు వారు వచ్చిన దాఖలాలు లేవు. కడలి గ్రామానికి చెందిన జాన్ బెన్నీ, రుత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు.

ఇంటి పక్క ఒకరు మృతి చెందటంతో భయం .. అప్పటి నుండి అన్నీ గదిలోనే

ఇంటి పక్క ఒకరు మృతి చెందటంతో భయం .. అప్పటి నుండి అన్నీ గదిలోనే

15 నెలల క్రితం కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో రుత్తమ్మ ఇంటి పక్కనే ఒకరు కరోనాతో చనిపోవడంతో, అప్పటినుండి భయాందోళనకు గురైన రుత్తమ్మ, ఆమె ఇద్దరు కూతుళ్లు కాంతామణి, రాణి ఒకే గదిలో ఉండి పోయారు. వారికి ఏం కావాలన్నా రుత్తమ్మ భర్త జాన్ బెన్నీ, అతని కుమారుడు బయటకు వెళ్ళి తీసుకు వచ్చేవారు. బయటకు రమ్మంటే రాకుండా గదిలోనే ఉండిపోయేవారు. అయితే ఇటీవల జాన్ బెన్నీ ఇంటి స్థలం విషయంలో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు తీసుకోవడం కోసం వారి ఇంటికి వెళ్లిన గ్రామ వాలంటీర్ వారి వేలి ముద్రల కోసం బయటకు పిలువగా వారు రావడానికి నిరాకరించారు.

 విషయం తెలిసి అవాక్కయిన గ్రామ వాలంటీర్ .. అధికారుల కౌన్సిలింగ్

విషయం తెలిసి అవాక్కయిన గ్రామ వాలంటీర్ .. అధికారుల కౌన్సిలింగ్


దీంతో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ వాలంటీర్ అవాక్కయ్యారు. దీనిపై ఉన్నతాధికారులకు గ్రామ వాలంటీర్ ఫిర్యాదు చేయగా వారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.15 నెలలుగా ఒకే గదిలో ఉన్నవారంతా కరోనా కు భయపడి బయటకు రావడం లేదని అధికారులు, పోలీసులు విచారణలో తేల్చారు. మొత్తానికి వారికి అర్థమయ్యేలా చెప్పి, వారిని బయటకు రావడానికి ఒప్పించిన అధికారులు వారి ఆరోగ్యం క్షీణించి నట్టుగా గుర్తించారు.

 ఆస్పత్రికి తరలించి ముగ్గురికి చికిత్స

ఆస్పత్రికి తరలించి ముగ్గురికి చికిత్స

15 నెలల పాటు ఒకే గదిలో ఉండి అక్కడే కాలకృత్యాలతో పాటు, అన్ని చేసిన వారి మానసిక స్థితి కూడా కాస్త ఆందోళనకరంగా ఉండటంతో బాధిత మహిళలను రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాజోలు ఏరియా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

English summary
Three women from the same family have been living in a small room for 15 months for fear of a corona epidemic in Rajolu Mandal Kadali village in West Godavari district. There were no records of them coming out of the room for 15 months. When the matter came to light through the village volunteer the officials were given counseling and rushed them to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X