ప్రమాదకరం, టీడీపీ, బీజేపీ వల్లే: అవిశ్వాసంపై జగన్, మద్దతు కోరుతూ వివరణాత్మక లేఖ

న్యూఢిల్లీ: శుక్రవారం(మార్చి16న' వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న నేపత్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కోరుతూ భారీ సుదీర్ఘ రాశారు. తమ రాష్ట్రానికి న్యాయం కోసం పోరాడుతున్నామని, తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

    కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ !

    తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6వ తేదీన తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్‌ తెలిపారు.

    నియంతృత్వ పోకడలతో విభజన

    నియంతృత్వ పోకడలతో విభజన

    ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను అనాగరికంగా తొక్కిపెట్టి, బలవంతంగా ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు-2014ను ఆమోదించిన సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని అప్రజా స్వామికంగా నియంతృత్వ పోకడలతో విభజించారు. విభజనపై భిన్నాభిప్రాయాలు బయటకు పొక్కకుండా పార్లమెంట్‌ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసి, ద్వారాలు మూసివేసి బిల్లును ఆమోదిం చారు. నాడు బిల్లును వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోకుండా వారిని సస్పెండ్‌ చేశారు' అని లేఖలో పేర్కొన్నారు జగన్.

    మా పోరాటానికి మీ మద్దతు

    మా పోరాటానికి మీ మద్దతు

    ‘ఇప్పుడు న్యాయం కోసం మేం చేస్తున్న పోరాటానికి మీ మద్దతును కూడగట్టడానికి ఈ లేఖ రాస్తున్నాను. పార్ల మెంట్‌లో బిల్లు పాస్‌ కావడంతో హైదరాబా‌ద్‌తో కూడిన తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరు చేశారు. విభజన బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. తీవ్రంగా నష్టపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేశారు' అని జగన్ వివరించారు.

    టీడీపీ, బీజేపీ వల్లే ఈ పరిస్థితి

    టీడీపీ, బీజేపీ వల్లే ఈ పరిస్థితి

    ‘రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పలు హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇతర హామీలను నెరవేర్చడంతోపాటు ప్రత్యేక హోదాను వర్తింపజేస్తామన్నారు. అప్పటి ప్రతిపక్షాలు దీనికి మద్దతుగా నిలిచాయి. ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, పదేళ్లపాటు వర్తించేలా ఇవ్వాలని వెంకయ్య నాయుడు విన్నవించారు. పరిశ్రమలు స్థాపించడానికే మూడు నాలుగేళ్లు పడుతుందని, అందువల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం అందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు షరతుతో టీడీపీసహా అధికార, ప్రతిపక్షాలు బిల్లును ఆమోదింపజేసుకున్నాయి’ అని జగన్ తెలిపారు.

    తిరుపతిలో వాగ్దానం

    తిరుపతిలో వాగ్దానం

    ‘2014 మార్చి 2న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ, నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ.. చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో వాగ్దానం చేశారు. చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి హోదాను 15 ఏళ్లపాటు వర్తింపజేయాలని, తద్వారా రాష్ట్రం తగిన విధంగా పరిహారం పొందగలదని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచాయి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను భుజాన వేసుకున్న బీజేపీ, టీడీపీ అకస్మాత్తుగా ఆ అంశంపై నీళ్లు చల్లాయి. చంద్రబాబు అండతోనే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సాయం(స్పెషల్‌ ప్యాకేజీ)ని తెరపైకి తెచ్చారు. ఈ ప్యాకేజీ నామమాత్రమే' అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు

    ముందుకు రాని టీడీపీ, బీజేపీ

    ముందుకు రాని టీడీపీ, బీజేపీ

    ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పారు. కానీ, ఇప్పటికీ 11 రాష్ట్రాలు హోదా ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాయి. ప్రత్యేక హోదా వ్యవస్థను ఏ రాష్ట్రానికీ తాము నిరాకరిం చలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్‌ సేన్, గోవిందరావు ఇటీవలే లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. అప్పటి కేంద్ర మంత్రి మండలి 2014 మార్చి 2న ఏపీకి ప్రత్యేక హోదాను వర్తింపజేస్తూ తీర్మానించడమే కాకుండా దానిని అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్‌ ఉనికిలోకి వచ్చింది.

    ఎన్డీయే అధికారంలోకి

    ఎన్డీయే అధికారంలోకి

    ‘నీతి ఆయోగ్‌ వచ్చే నాటికి.. అంటే 10 నెలలుగా ప్రణాళిక సంఘానికి కేంద్ర కేబినెట్‌ నుంచి అందిన ఆదేశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2014 జూన్‌లో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు నెలల వరకూ ప్రణాళిక సంఘం ఉన్నా ఆ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీలోని అధికార టీడీపీ కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వామిగా, మంత్రివర్గంలో ఉండి ఈ అంశాన్ని ప్రణాళిక సంఘంతో చర్చించలేదు' అని జగన్ వివరించారు.

    సాకులు వెతుకుతున్నారు..

    సాకులు వెతుకుతున్నారు..

    ‘13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్న కాలంలో 2014 మార్చి 2న కేంద్ర కేబినెట్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించిన తరువాత 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని ఎలా నెడతారు? 14వ ఆర్థిక సంఘం సిఫారసులు 2015 ఏప్రిల్‌ 1న అమల్లోకి వచ్చాయి. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడూ చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిం ది పోయి హోదా ఇవ్వకుండా ఉండటానికి సాకులు వెతుకుతున్నారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    హోదా లేకుంటే మనుగడ లేదు.. ఇదే నా విన్నపం

    హోదా లేకుంటే మనుగడ లేదు.. ఇదే నా విన్నపం

    ‘ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఆ హోదా వల్ల ఎలాంటి ఉపాధిని సృష్టించలేదని, ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేదని చెబుతున్నారు. కానీ ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌ వంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు వేలాది పరిశ్రమలను, తద్వారా లక్షలాది ఉద్యోగాలను సృష్టించగలిగాయి. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానమే. 100 శాతం ఆదాయపు పన్ను, జీఎస్టీ మినహాయింపులు, విద్యుత్తు బిల్లుల్లో రాయితీ తదితర ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల కలిగి ఉండటం వల్లే హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు వచ్చాయి. ఈ ప్రోత్సాహకాలు ఇవ్వని పక్షంలో మా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు సహేతుకమైన ప్రాతిపదిక ఏముంది? ఈ ప్రోత్సాహకాలు లేనిపక్షంలో.. హైదరాబాద్‌ను కోల్పోయిన మా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఎలా దక్కుతాయి? విభజన జరిగినప్పుడు మా రాష్ట్రానికి రూ.97,000 కోట్ల అప్పును చూపారు. 60 ఏళ్లపాటు వృద్ధి చెందిన అప్పు ఇది’ అని జగన్ చెప్పారు.

    ఎలా మనుగడ సాధించగలదు?

    ఎలా మనుగడ సాధించగలదు?

    ‘గత నాలుగేళ్లలో మా రాష్ట్రం అదనంగా రూ.1.20 లక్షల కోట్ల మేర అప్పు తెచ్చింది. మొత్తం రూ.2.20 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. ఇంత అప్పుతో, పరిశ్రమలు లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా మా రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదు? ఏపీ ముఖ్యమంత్రి చెప్పే తప్పుడు లెక్కలు, అబద్ధపు అభివృద్ధిని నమ్మకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ మద్దతుగా నిలవాలని కోరుతున్నా' అని జగన్ తన లేఖలో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు

    అది ప్రమాదకరం.. రాజీనామాలే

    అది ప్రమాదకరం.. రాజీనామాలే

    ‘ఇన్నేళ్లుగా మా పార్టీ ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతోంది. పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రత్యేక హోదాను నిరాకరించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల(మార్చి) 16వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌ సాక్షిగా ముందస్తు షరతుతో రాష్ట్రాన్ని విభజించి, ఇప్పుడు ఆ హామీని గౌరవించకపోతే ప్రజలు పార్లమెంటరీ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతారు. ప్రపంచంలోనే పేరున్న మన దేశ ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరమైన పరిస్థితిగా మారుతుంది. మా న్యాయమైన డిమాండ్‌కు మీరు అండగా నిలవాలని, ఈ నెల 16వ తేదీన కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మీరు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత కూడా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా పార్టీ ఎంపీలు తమ స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన రాజీనామా చేస్తారు' అని జగన్ స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+