ఎన్నారైల ఉచిత కంటి వైద్య శిబిరాలు
నల్లగొండ డాట్ ఆర్గ్, టిడియఫ్ - యుయస్‌ఎ సంయుక్తంగా ఇటీవల గత మూడు నెలల కాలంలో నల్లగొండ జిల్లాలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించింది. వీటి వల్ల దాదాపు 25 వేల మంది గ్రామీణులు లబ్ధి పొందారు. అమెరికాలోని ప్రవాస భారతీయులు తమ తమ గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలను స్పాన్సర్ చేశారు. ఆ విధంగా 50 వైద్య శిబిరాలను స్పాన్సర్ చేశారు. హైదరాబాద్‌లోని ఆర్. ఆర్. ఆస్పత్రి ఆధ్వర్యంలో దృష్టి ఫౌండేషన్ ఈ వైద్య శిబిరాలను సమన్వయం చేయడంలో తోడ్పడింది.
సగటున గ్రామానికి 500 మంది ఈ శిబిరాల ద్వారా లబ్ధి పొందారు. శస్త్రచికిత్సలు అవసరమైనవారిని గుర్తించి అత్యవసరమైనవారికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు. సగటున గ్రామానికి 250 మందికి కండ్లద్దాల అవసరం ఏర్పడినట్లు గుర్తించారు. వారికి తక్కువ ధరకు కళ్లజోళ్లు అందజేశారు. కళ్లజోడకు 40 రూపాయల చొప్పున తీసుకున్నారు. చాలా చోట్ల కళ్లజోళ్లు కూడా స్పాన్సరర్లు ఉచితంగా అందజేశారు. ప్రజల కంటిచూపు బాగు చేయడానికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నల్లగొండ డాట్ ఆర్గ్ గుర్తించింది.
జిల్లా గ్రంథాలయాల చైర్మన్ వినోద్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ గ్రంథాలయంలో కొత్త రిసోర్స్ సెంటర్‌ను చేయడానికి కూడా నల్లగొండ డాట్ ఆర్గ్ సహాయం అందిస్తోంది. విదేశాల్లో విద్యనభ్యసించేవారికి ఉపయోగకరంగా ఉండేలా చూస్తున్నారు. నల్లగొండ డాట్ ఆర్గ్ నల్లగొండ జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి ఈ సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహించింది.












Click it and Unblock the Notifications