ఎన్నారైల విరాళాలు
ఆంధ్రప్రదేశ్ లోని సికింద్రాబాదులో గల పుష్పగిరి కంటి ఆస్పత్రి కోసం ఇండో - అమెరికన్ ఐ కేర్ ఆర్గనైజేషన్ డెట్రాయిట్ లో అక్టోబర్ 27వ తేదీన నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కె.ఆర్. సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిచిగాన్ స్టేట్ సెనేటర్ హన్లన్ క్లార్క్, హౌస్ రిప్రజెంటెటివ్ ఆండ్ర్యూ మీస్నర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దాదాపు 400 మంది దీంట్లో పాల్గొన్నారు.
కార్యక్రమం కన్వీనర్ రాంరెడ్డి స్వాగతం చెప్పారు. ఆప్తాల్మాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సునీత యెడవల్లి డయాబెటిస్ గురించి వివరించారు. పేదల్లో డయాబెటిక్ ఐ కేర్ అవసరం గురించి వనితా రెడ్డి చెప్పారు. లాభాలు అశించకుండా ఆంధ్రప్రదేశ్ లో పుష్పగిరి ఐ ఆస్పత్రి డయాబెటిక్ ఐ కేర్ ను అందిస్తోంది. డాక్టర్ చంద్రారెడ్డి కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి గోవింద్ హరి, డాక్టర్ కె. విశ్వనాధ్ వచ్చారు. మహేశ్ సలాది, వనితా రెడ్డి నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష డాలర్ల నిధులు సమకూరాయి. డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, కృష్ణప్రసాద్ కాట్రగడ్డ, డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి, శైలేష్ సక్సేనా, డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల, శ్రీధర్ తాలంకి, డాక్టర్ శ్రీనివాస్ గునుకుల, రామ్ కె. రెడ్డి విరాళాలు అందజేసిన ముఖ్యులు.
చివరగా లీలా ప్రసాద్ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, నేపథ్య గాయని విజయ లక్ష్మి తమ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు.












Click it and Unblock the Notifications