సోనియాకు తెలంగాణ నిరసన
ఐక్య రాజ్య సమితి (యుఎన్)లో ప్రసంగించడానికి న్యూయర్కులో ఈ నెల 2వ తేదీన తెలంగాణ ఎన్నారైల నుంచి నిరసన ఎదురైంది. దాదాపు 50 మంది తెలంగాణ ఎన్నారైలు యుఎన్ భవనం వద్ద గుమికూడి తమ నిరసన వ్యక్తం చేశారు. సెయింట్ లూయిస్ నుంచి శ్రీరాం వదిరె, వాషింగ్టన్ డిసి నుంచి స్వామి సవితానంద, న్యూజెర్సీ నుంచి అమెరికాలో ఉన్న కూతురును చూడడానికి వచ్చిన 75 ఏళ్ల హైదరాబాదీ మధుసూదన్ రెడ్డి వంటి వారు ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బోస్టన్, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీల నుంచి నుంచి గుంపులగుగా వచ్చారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్ల సోనియా నిర్లక్ష్యం వహించడాన్ని వారు విమర్శించారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, తెలంగాణ అభివృద్ధికి దీర్ఘ కాలిక ప్రణాళికను అమలు చేయాలని కొంత మంది పెట్టిన డిమాండ్లు కూడా గాలికే పోయాయని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications