విదేశీ నేలపై మొట్టమొదటి ప్రొ తెలుగు సమావేశం

ఆర్గనేజేషన్ ఉపాధ్యక్షుడు సురేష్ సోమిశెట్టి ముఖ్య అతిధిని, ఇతర సభ్యులను ఆహ్వానిస్తూ ప్రసంగించగా, డాక్టర్ మిత్రా డెట్రాయిట్ సమావేశానికి హాజరైన వారి ఉత్సాహాన్ని పొగుడుతూ "అరవై ఏళ్ళుగా అంధకారంలో ఉన్న ఆంద్ర రాజకీయల్లో వెలుగు నింపడానికి ఒక కొత్త రాజకీయ శక్తి రావడం ఖాయమని" అన్నారు. మరో వీడియో సందేశంలో రాజకీయ విశ్లేషకులు డాక్టర్ కె. నాగేశ్వర్ "ఎన్నారై ల సహాయం రాష్ట్రానికి అత్యవసరం. పొరుగు దేశం చైనా ఆకర్షించినంతగా మన దేశం విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించలేక పోతోంది. ప్రస్తుత వ్యవస్ద ప్రజలకు కనీస అవసరాల్ని కూడా తీర్చే పరిస్దితిలో లేదు. ఇతర రాష్ట్లాల్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ పారిశ్రామికంగా వెనకబడి ఉంది. మన రాష్ట్రంలోని మానవ వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. ఎన్నారైలు తమ తమ జిల్లాల్లో ఎలాంటి వనరులు ఉన్నాయి, వాటిని ఎలా అభివృద్దికి ఉపయోగించాలనే విషయం పై పరిశోధన చేయాలి. మనం అభివృద్ది సాధించకపోతే మన ముందు తరాల వారు మనల్ని నిందిస్తారు" అన్నారు. ముఖ్య అతిధి గా వచ్చిన సినీ నటుడు, నిర్మాత, న్యూరాలజిస్టు డాక్టర్ హరనాద్ పొలిచెర్ల "సామాజిక మార్పు-ఎన్నారై ల పాత్ర" "ఆంధ్ర ప్రదేశ్ లో విధ్య, ఆరోగ్య రక్షణ వ్యవస్ద" " సమగ్ర అభివృద్ది లో ఎన్నారైల పాత్ర" అనే అంశాల పై ఉపన్యసించారు. ప్రో తెలుగు ఆర్గనైజేషన్ వ్యవస్దాపక కార్యదర్శి శ్రీ రామ్ తాతినేని తిరుపతి నుండి శ్రీకాకుళం వరకు జరిగిన 'మహాయాత్ర' అనుభవాల్నిఆహుతులతో పంచుకున్నారు. శ్రీ ప్రసాద్, శ్రుధార్ బండారు, ఇతర మేధావులు ఈ సంధర్బంగా ప్రసంగించారు. అనంతరం అమెరికాలో ప్రో తెలుగు చేపట్టిన కార్యక్రమాల స్లైడ్ షో, మహాయాత్ర ఫోటోల ప్రదర్శన జరిగింది. ప్రో తెలుగు మీడియా సెక్రటరీ శ్రీ రావు సిద్దాం అతిధులకు, సభ్యులకు, హాజరైన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications