సొంతగూటికి తిరిగి రండి: మన్మోహన్ పిలుపు

భారత్‌కు తిరిగి రాదలచుకున్న ఇండో-అమెరికన్లు, ప్రవాస భారతీయులందరినీ ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. 'ఇప్పటికే మేధోవలసలు తిరుగుముఖం పట్టడాన్ని చూశాం. ఈ ప్రక్రియను 'మేధో లాభం'గా పిలవడానికి నేను ఇష్టపడతాను' అని ప్రధాని పేర్కొన్నారు. 'భారత్‌లో పనిచేయాలా, లేక అమెరికాలో పనిచేయాలన్న అన్నదానిపై తర్జనభర్జనలక్కర్లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పూర్తి వెసులుబాటుతో కూడిన మన విధానాలు రెండు చోట్లా పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి' అని వివరించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ గురువారం ఉదయం వాషింగ్టన్ నుంచి... ట్రినిడాడ్-టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు వెళ్లారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో శుక్రవారం ప్రారంభం కానున్న కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు (చోగమ్)లో మన్మోహన్ పాల్గొంటారు.
అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధానికి ఇచ్చిన ప్రతిష్ఠాత్మక విందు కార్యక్రమానికి ఆహ్వానంలేని ఓ జంట హాజరైంది. శ్వేతసౌధం భద్రతకు సవాలు లాంటి ఈ పరిణామం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉత్తర వర్జీనియాకు చెందిన మైఖేల్, తరేక్ సలాహీలు మంగళవారం రాత్రి అన్ని అడ్డంకులు దాటుకుని విందు జరిగిన లాన్స్‌లోకి వచ్చేశారు. విందుకు హాజరైన పలువురు ప్రముఖులతో ఫొటోలు కూడా దిగారు. తాము సాధించిన ఘనతను ఫొటోలతో సహా ఫేస్‌బుక్ వెబ్‌పేజీలో పెట్టారు. ఈ ఇద్దరూ ఆహ్వానితుల జాబితాలో లేరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శ్వేతసౌధంలోకి ఎలా వచ్చారన్న దానిపై నిఘా వర్గాలు దర్యాప్తు మొదలెట్టాయి.












Click it and Unblock the Notifications