ఉస్మానియాకు ఎన్నారైల విరాళం

ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం తాము చేయదలుచుకున్న కృషిలో హరినాథ్ మేడి, డాక్టర్ వెంకటేశ్వర్లు, బుచ్చన్న గాజుల, శరత్ వేముల ఉన్నారు. కంప్యూటర్ సెంటర్ కోసం ఉద్దేశించిన 40 లక్షల రూపాయల చెక్ ను వారు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరుపతిరావు, రిజిస్ట్రార్ ముత్యం రెడ్డిలకు అందజేశారు.
తమ సంఘం 90 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు బుచ్చన్న గాజుల తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా నుంచి 90 మంది స్టార్ ఉస్మానియన్లను, అమెరికా నుంచి 90 మంది స్టార్ ఉస్మానియన్లను గుర్తిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications