యూనివర్సిటీ కోసం పాలమూరు ఎన్నారైల ఔదార్యం

పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులను సేకరించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రొఫెసర్ రెడ్డి న్యూజెర్సీ వచ్చిన పాలమూరు ఎన్నారై ఫోరం (పిఎన్నారై ఫోరం) సోమర్ సెట్ లో ఘనంగా సన్మానించింది. ఈ సన్మానసభకు హాజరైన పారమూరు ఎన్నారై ఫోరం సభ్యులను, అమెరికా పర్యటనకు వచ్చిన వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు.
పాలమూరు విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ పట్టణంలో ఇటీవలే 187 ఎకరాల భూమిని కేటాయించింది. సంవత్సరం క్రితమే ప్రొఫెసర్ రెడ్డిని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా నియమించింది. అప్పటి నుంచి వర్శిటీ అభివృద్ధి కోసం ప్రొఫెసర్ రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications