అమెరికాలో 'టాకో' రజతోత్సవం

ఆట, పాటలతోనూ సాంస్రృతిక కార్యక్రమాలతోనూ సందడి సందడిగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. తానా అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారు వివిధ రంగాల్లో ప్రముఖ స్ధానాల్లో ఉన్నారని, పాతిక, ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే స్ధిరపడి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరదల మూలంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవటానికి ప్రవాసాంధ్రులు లక్షలాది డాలర్లను విరాళాలుగా అందించారని తెలిపారు.
తానాను పటిష్ఠం చేయటానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని, సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని జయరాం కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు గుండు హనుమంతరావు, ఉత్తేజ్, అనంత్, అపూర్వ, మనోజలు ప్రదర్శించిన 'సత్తురూపాయి', 'వెయ్యినోటు' తదితర హాస్యనాటికలు ఆహుతులను అలరించాయి. ప్రముఖ గాయనీ విజయలక్ష్మీ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ ఉత్సవాలను టాకో అధ్యక్షుడు అంజు వల్లభనేని, ఉత్సవాల సమన్వయకర్త జగదీష్ ప్రభల, టాకో కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications