మిన్నె పాలిస్: తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్దులు, ప్రజలకు మిన్నెసొట తెలంగాణ ఎన్నారైలు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం చేసిన ప్రకటనపై తెలంగాణ ఎన్నారైలు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 'తెలంగాణ వేదిక' ఆధ్వర్యంలో, స్థానిక రిడ్జ్‌డేల్ లైబ్రరీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 50 మందికి పైగా తెలంగాణ ప్రవాసాంధ్రులు పాల్గొని ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా 'జై తెలంగాణ' నినాదాలతో సమావేశ ప్రాంగణం మారుమ్రోగింది. అదేవిధంగా 'జయ జయహో తెలంగాణ' వంటి విజయగీతాలను విని ఆహూతులు ఆనదించారు. తదుపరి తెలంగాణ ఉద్యమ ఘట్టాలతో కూర్చిన వీడియో ప్రదర్శనం అందర్నీ ఉత్తేజపరిచింది. అటుపిమ్మట తెలంగాణపై ఆహూతులు తమ అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. చివరిగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడంతో కార్యక్రమం ముగిసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి