కొలంబస్ బాబా గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలు

NRI
ఇండియానాపోలిస్‌: ఒహాయో రాష్ట్ర సాయిబాబా మందిర సమాజం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొలంబస్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ ఉత్సవాల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పలువురు ప్రవాసాంధ్రులు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామి వారి విగ్రహాలను పల్లకిలో వూరేగించి చందనోత్సవం కార్యక్రమంతో కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. మందిర సమాజం తరుపున ఆలయ కమిటీ అధ్యక్షుడు వట్టి తేజో మూర్తి స్వామి వార్లకు మధుపర్కాలను సమర్పించారు. షిర్డీ సాయిబాబా పల్లకి సేవతో వేడుకలకు ముగింపు పలికారు.

సుమారు 900 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు విందు భోజనాలను ఏర్పాటు చేశారు. మే 27న నిర్వహించే శాశ్వత షిర్డీ సాయిబాబా ఆలయ శంఖుస్థాపన, నిర్మాణ కార్యాచరణ ప్రణాళికలను బోర్డు అధ్యక్షుడు యర్రంశెట్టి సత్య ప్రకటించారు. సుమారు 16,500 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మిస్తున్న ఈ మందిరం అమెరికాలో అతిపెద్ద భారతీయ మందిరంగా నిలుస్తుందని ఆలయ కమిటీ తెలిపింది. షిర్డీ సాయిబాబాతో పాటు హనుమంతుడు, విఘ్నేశ్వరుని విగ్రహాలను కూడా ప్రతిష్ఠంచనున్నట్లు వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+