అమెరికా తెలుగు సాహితీ సదస్సు

ఇందులో స్వీయ రచన పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, పుస్తకావిష్కరణలు, సాహిత్యం పోటీలు, గొలుసు కథల పోటీలు ఉంటాయి. 1998లో ప్రారంభమైన తెలుగు సాహితీ సదస్సు 6 ద్వైవార్షిక ఉత్సవాలు పూర్తి పూర్తి చేసుకున్నప్పటికీ ఈ 7వ ఉత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆదికవి నన్నయ మహాభారత రచన ప్రారంభమైన సందర్భంగా తెలుగు సాహిత్యం జరుపుకుంటున్న వేయి సంవత్సరాల పండుగ ఒకటి, తెలుగును ఆదరించి భాషకు ఓ వెలుగు తీసుకు వచ్చిన శ్రీకృష్ణ దేవరాయల పంచవర్ష పట్టాభిషేక ఉత్సవం ఇదే సంవత్సరం కావటం మరొకటి. సదస్సులో ప్రసంగించడానికి అక్టోబర్ 1లోపు పేరు నమోదు చేసుకోవాలి. రెండు రోజులకు ఖర్చుల నిమిత్తం మనిషికొక్కంటికి 50డాలర్ల అతి తక్కువ రుసుము వసూలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications