• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో ఎన్నారైల దసరా పండుగ

By Pratap
|
Google Oneindia TeluguNews
NRI
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎన్నారైలు విజయదశమి, దసరా పండుగను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవానికి 2,250 మందికి పైగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలను ఇది గుర్తు చేసింది. దుర్గాపూజతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, బోర్డు ట్రస్టీలు సుధాకర్ పెర్కారి, బలవంత్ కొమ్మిడి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యూయార్క్ ఇండియన్ కాన్సుల్ జనరల్ ప్రభు దయాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా రాజకీయాల్లో విజయం సాధించిన తెలుగు వ్యక్తి, న్యూజెర్సీ అసెంబ్లీ ప్రతినిధి ఉపేంద్ర చివుకుల గౌరవ అతిథిగా హాజరయ్యారు. అమెరికాలోని తెలుగు ప్రజలకు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న సంస్థ అటా అని బలవంత్ కొమ్మిడి అన్నారు.

న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ నాన్ స్టాప్ విమానాన్ని వేయాలని డాక్టర్ జిన్నా ప్రభు దయాళ్‌ను కోరారు. ఈ విషయాన్ని తాను భారత పౌర విమాన యానాల మంత్రి దృష్టికి తెస్తానని ప్రభు దయాళ్ హామీ ఇచ్చారు. స్థానిక కళాకారులు, టాలీవుడ్ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. రఘు కుంచె, విజయ లక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ విద్యాసాగర్,త నారాయణ పిర్లమర్ల, మధు కె రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆటా మద్దతుదారులు నరేందర్ యాసా, శ్రీనివాస్ గాదె, జైదీప్ రెడ్డి, కైలాష్ బస్తా, రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ యజమాని అల్బర్ట్ జస్సానాీ, డాక్టర్ సుధీర్ పరీఖ్, రాజీవ్ బాంబ్రీ, డాక్టర్ సునీతా కనుమూరిలను సత్కరించారు. ఆటా న్యూజెర్సీ టీమ్ ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులను అభినందించారు. వీరిలో టిఎఫ్ఎఎస్ అధ్యక్షుడు ఆనంద్ పాలూరి, నాట్స్‌కు చెందిన మోహన్ కృష్ణ మన్నవ ఉన్నారు.

ఆటా టీమ్ సభ్యులు విజయ్ కుందూరు, భగ్వాన్ పింగళి, వేణు సంకినేని, రామ్ రెడ్డి, సురేష్ జిల్లా, కృష్ణ డ్యాపా, పర్మేష్ భీంరెడ్డి, శ్రీనివాస్ దుర్గల, రవి పట్లోల, రాజ్ చిలుముల, మాధవ్ పూసర్ల, శ్రీకాంత్ గుడిపాటి తదితరులు దసరా ఉత్సవాలను విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆటా సీనియర్ సభ్యుడు అర్జున్ ద్యాపాను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దసరా పండుగ గుర్తించి కవి వడ్డేపల్లి కృష్ణ వివరించారు. రమ్య కొమ్మిడి శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఆటా ప్రాంతీయ సమన్వయకర్తలు భగ్వాన్ రెడ్డి, వేణు, రామ్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

English summary
ATA has celebrated Vijayadasami in a grand manner at New Jersey of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X