వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీలునామాపై ఎన్నారైల సదస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

ATA Dallas
అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్‌ చాప్టర్ ఈ నెల 26వ తేదీన వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్‌పై సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రుచి ప్యాలెస్‌లో ప్రారంభమవుతుంది. వీలునామా, ట్రస్టులు, ఎస్టేట్ ప్లానింగ్‌లో ప్రత్యేకతను సాధించిన డల్లాస్‌కు చెందిన ఆకుల అండ్ అసోసియేట్స్ సంస్థకు చెందిన ఆకుల కవిత ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సుకు మొదట విచ్చేసిన 25 మందికి ఆటా 25 కూపన్లను అందజేస్తుంది. ఈ కూపన్లపై ఆకుల సంస్థలో ఉచితంగా వీలునామాలను సిద్ధం చేస్తుంది.

వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ సంపన్నులకు, వయస్సు మీరినవారికి మాత్రమే కాదని ఆటా చెబుతోంది. ఇల్లు, స్టాక్ ఫోర్ట్‌ఫోలియోలు, కారు, కంప్యూటర్ వంటివి ఉన్నవారికి కూడా వీలునామా అవసరమని అంటోంది. దీని ద్వారా ప్రభుత్వం వారసులను నిర్ధారిస్తుందని స్పష్టం చేస్తోంది. మైనర్ పిల్లలకు సంరక్షకులను కూడా నిర్ధారిస్తుంది. పన్నులను కూడా తగ్గిస్తుందని చెబుతోంది.

English summary
ATA Dallas chapter is organizing a ‘Will & Estate Planning’ seminar on 26th, March 2011 at Ruchi Palace from 12 PM onwards. The event is free for all and everyone is invited. The seminar will be conducted by Mrs.Kavitha Akula of Akula & Associates, a Dallas based law firm specializing in Wills, Trusts and Estate Planning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X