వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమెరికాలో సన్మానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

NRI
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబరుపేట శాసనసభ్యులు జి కిషన్ రెడ్డి ఈ నెల 24వ తారీఖున చికాగోలాండ్‌లోని తెలుగు కమ్యూనిటీస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఓరుగంటి శ్రీనివాస్, నెల్లుట్ల తిరుమల్, శ్రీనివాస్ గౌడ్‌లు కిషన్ రెడ్డిని పరిచయం చేసి ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగిన వైనాన్ని తెలిపారు. జాతికి, ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయడం ద్వారా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారని చెప్పారు. అనంతరం కిషన్ రెడ్డి అవినీతిపై పోరాటం, ఉగ్రవాదం కారణంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పారు. ఆ తర్వాత వాటిపై బిజెపి చిత్తశుద్ధితో ఎలా పోరాటం చేసి ప్రభుత్వం సక్రమ పాల అందించడానికి కృషి చేస్తుందో చెప్పారు. ఇటీవలి కాలంలో ఎంతో అభివృద్ధి సాధించిన గుజరాత్ రాష్ట్రం స్ఫూర్తిగా మిగిలిన రాష్ట్రాలు అభివృద్ధి చెందితే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతుందన్నారు.

తెలంగాణ కోసం బిజెపి ఇస్తున్న మద్దతును సైతం ఆయన వివరించారు. చిన్న రాష్ట్రాలతోనే మంచి పరిపాలన సాధ్యమవుతుందన్న గట్టి అభిప్రాయంతో తెలంగాణకు బిజెపి మద్దతు ఇస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటే కాంపిటీషన్ కారణంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ప్రస్తుత సంక్షోభానికి తెరతీయాలని ఆయన సూచించారు. 2013లో యోగి, స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఎన్నారైలు అందరూ ముందుకు రావాలని కోరారు. ప్రపంచంలో భారత్‌ను లీడర్‌గా నిలబెట్టడంలో ఎన్నారైలు ప్రముఖ పాత్ర వహించాలని సూచించారు. కాగా శ్రీరామ్ వెదిరె, వేమూరి సుబ్రహ్మణ్యం తదితరులు భారతదేశంలోని కొన్ని అంశాలపై బిజెపికి సలహాలు ఇచ్చారు. ఢిల్లీకి చెందిన బిజెపి నాయకుడు విజయ్ జోలీ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అమెరికా నేతల దృష్టి భారతదేశం వైపు పడేలా ఎన్నారైలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు కిషన్ రెడ్డిని మెమొంటో, శాలువాతో సత్కరించారు.

English summary
Sri Kishan Reddy addressed the gathering and spoke about issues of national interest such as fighting corruption, the continuing threat of terror, and stressed BJP’s strong commitment in fighting these challenges faced by the nation and transforming to deliver good governance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X