అవినీతిపై పోరు: ఎన్నారైలతో కిరణ్ బేడీ

పిఎఫ్ఎల్ నిర్వహించిన దండి మార్చ్ -2 వంటి కార్యక్రమాల ద్వారా ఎన్నారైలు తమ దేశభక్తిని చాటుకున్నారని ఆమె కొనియాడారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోని ఎన్నారైలు దండి మార్చ్ - 2 వంటి కార్యక్రమాలు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టడం అవసరమని ఆమె అన్నారు. పాలనా సంస్కరణలు, ఎన్నికల సంస్కరణల కోసం పోరాటాలు చేయాలని ఆమె అన్నారు. కిరణ్ బేడీ అర గంట పాటు ప్రసంగించారు. సమావేశానికి వచ్చినవారు వేసిన ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
అమెరికాలో కిల్ కరప్షన్ ఉద్యమాన్ని సమన్వయం చేస్తున్న హైమా సాగి పిఎఫ్ఎల్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరిస్తామని దినేష్ చెప్పారు. కార్యక్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ రణబోతు కిరణ్ బేడీకి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications