వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ తెలుగు ఎన్నారై తన దయనీయ గాధను వినిపించారు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా (ఎఎల్ఎల్)తో బాధపడుతున్న ఆ ఎన్నరై విద్యార్థికి సహాయం అందించాలని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ముందుకు వచ్చింది. ఆ విద్యార్ధి గాధను వినిపిస్తూ సహాయం అందించాల్సిందిగా కోరింది. గాదం శ్రీనివాస రావు అనే ఈ విద్యార్థి కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ చదివాడు. ఇంటర్నల్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ కోసం అతను 2008లో అమెరికా చేరుకున్నాడు. తన చదువును ముగించి కలను సాకారం చేసుకునే దశలో అతన్ని ఎఎల్ఎఎల్ భూతం పట్టుకుంది. అతనికి ల్యుకేమియా వ్యాధి సోకినట్లు 2010 ఫిబ్రవరిలో నిర్ధారణ అయింది. హూస్టన్‌లోని బెన్ టాబ్ ఆస్పత్రిలో ఆరు సైకిళ్ల కెమోథెరపీ తీసుకున్నాడు.
అయితే, చికిత్స పొందుతున్న క్రమంలోనే అతనికి ఇన్‌ఫెక్షన్ సోకింది. రక్తపోటును అదుపులో ఉంచే క్రమంలో అతని రెండు పాదాలకు గాంగ్రీన్ సోకింది. దాంతో 47 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాడు. గాంగ్రీన్‌ను తొలగించడానికి వ్యాస్కులార్ క్లియరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకు తనకు మద్దతు కావాలని శ్రీనివాస రావు కోరుతున్నాడు. గాదం శ్రీనివాస రావును అదుకోవడానికి ఉదారంగా ముందుకు రావాలని నాట్స్ కోరింది. అందుకు గాను https://natsworld.org/new/donate.php క్లిక్ చేయండి. గాదం శ్రీనివాస రావు ఇ - మెయిల్ sanctionofvictim@gmail.com. గాదం శ్రీనివాస రావు కోసం ఇచ్చే విరాళాల మొత్తానికి వంద శాతం ఐటి మినహాయింపు ఉంటుంది.
North America Telugu Society (NATS) regrets to share the unfortunate story of a fellow Telugu immigrant in his own words and urges you to support him. Gadam srinivas Rao needs donations to get treatment.
Story first published: Monday, February 28, 2011, 11:04 [IST]