వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం వాషింగ్టన్ డిసిలో ఎన్నారైల ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

NRIs formTelangana Rally in Washington D.C
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వాషింగ్టన్ డిసిలోని భారత దౌత్య కార్యాలయం, నేషనల్ క్యాపిటోల్ మైదానం వద్ద వందలాది మంది తెలంగాణ ఎన్నారైలు శనివారం ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరిని వారు ఖండించారు. భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను పట్టించుకోనప్పుడు అది ఏ విధమైన ప్రజాస్వామ్యం అవుతుందని జయప్రకాష్ అన్నారు. తెలంగాణ డిమాండ్ 1950 నుంచి ఉందని ఆయన అన్నారు. ఆ ప్రదర్శనలో నార్త్ డాకోటా, కాలిఫోర్నియా వంటి సుదూర ప్రాంతాలకు చెందిన ఎన్నారైలు కూడా పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయడానికి తెలంగాణ ఎన్నారైల జెఎసి పనిచేస్తుంది. తెలంగాణ ప్రజల సమస్యను అంతర్జాతీయ సమాజానికి వినిపించడానికి, పౌరుల ఆకాంక్షల పట్ల భారత ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించడాన్ని తెలియజేయడానికి తాము పనిచేస్తామని తెలంగాణ ఎన్నారైల జెఎసి చైర్మన్ రవి మేరెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరుగుతున్న తెలంగాణ ఆందోళనపై ప్రభుత్వం బలగాలను ప్రయోగిస్తోందని నారాయణ స్వామి విమర్శించారు. తెలంగాణ సాధన తన స్వప్నమని బియ్యాల వర్ష అన్నారు. తన తండ్రి బియ్యాల జనార్దన్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేశారని ఆమె చెప్పారు. శ్రీనివాస్ కొంపల్లి, పూల్ సింగ్ కూడా మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఇదే తగిన సమయమని మేరీలాండ్ నుంచి వచ్చన దశరథ్ బద్దం అన్నారు. మా భామి సంధ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

English summary
undreds of people hailing from India’s Telangana region staged a peaceful demonstration at Indian Embassy and National Capitol grounds on Saturday demanding an immediate action to restore the statehood to Telangana region in the southern Indian state of Andhra Pradesh .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X